బిగ్ బాస్ 4 తెలుగు కారణంగా ఫేడవుట్ అయిపోయిన మోనాల్ గజ్జర్ మళ్లీ తెలుగు ప్రేక్షకులకు చేరువవుతుంది. ఎవరో సుడిగాడు హీరోయిన్ అంట అనే వాళ్లే కానీ మోనాల్ అంటూ ప్రత్యేక గుర్తింపు అయితే లేదు. కానీ బిగ్ బాస్ 4 తెలుగు పుణ్యమా అని ఇప్పుడు మోనాల్ గజ్జర్ ఫేమస్ అయిపోయింది. అప్పుడెప్పుడో తెలుగులో ఓ కాలేజ్ స్టోరీ అనే సినిమాతో వచ్చింది మోనాల్. అయితే దానికంటే ముందు సుడిగాడు సినిమా విడుదలైంది. అది బ్లాక్‌బస్టర్ అయిన వెంటనే మలయాళంలో డ్రాకులా అనే సినిమాలో ఆఫర్ వచ్చింది. ఆ తర్వాత మరో సినిమా అక్కడే వచ్చింది. సరైన గైడెన్స్ లేక తమిళం, మలయాళం అంటూ అన్ని ఇండస్ట్రీలు తిరిగేసింది మోనాల్ గజ్జర్.

ఇక ఇదే విషయాన్ని ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఈ భామ. బిగ్ బాస్ 4లో 98 రోజుల పాటు ఉండి ఈ మధ్యే ఎలిమినేట్ అయింది మోనాల్. ఫినాలేకు ఒక్క వారం ముందు బయటికి వచ్చేసింది ఈ బ్యూటీ. వచ్చీ రాగానే వరసగా ఇంటర్వ్యూలు ఇచ్చేస్తుంది. అందులో కొన్ని సంచలన విషయాలు బయటికి చెప్తుంది. ఈ క్రమంలోనే తన బ్రేకప్ గురించి కూడా చెప్పింది. 2015 తర్వాత తెలుగులో నటించకపోవడానికి కారణం కూడా అదే అని క్లారిటీ ఇచ్చింది. బ్రదర్ ఆఫ్ బొమ్మాళి తర్వాత మరిన్ని ఆఫర్స్ వచ్చినా కూడా తానే కాదనుకున్నట్లు చెప్పింది.

ఎందుకంటే ఓ మలయాళ హీరోతో ఆరేళ్ళ తన ప్రేమకు బ్రేకప్ అయిందని.. అందుకే ఇకపై ఇక్కడ ఉండకూడదని ఫిక్స్ అయిపోయి సొంత ఇండస్ట్రీ గుజరాతీకి వెళ్లిపోయినట్లు చెప్పింది మోనాల్ గజ్జర్. అక్కడ 8 సినిమాల వరకు నటించినట్లు చెప్పుకొచ్చింది. దాంతో పాటు మరాఠీలో ఓ సినిమా.. హిందీలో ఓ సినిమాలో నటించింది ఈ బ్యూటీ. ఇప్పుడు తెలుగులో మళ్లీ అవకాశాలు వస్తే ఆలోచిస్తానని చెప్పింది. అయితే బ్రేక్ అప్ చెప్పిన హీరో పేరు మాత్రం బయట పెట్టలేదు. ఆయన మలయాళ హీరో అని మాత్రం చెప్పింది మోనాల్.

మరింత సమాచారం తెలుసుకోండి: