స్టార్‌ హీరోస్‌ని డైరెక్ట్‌ చేయాలంటే బ్యాక్ ‌గ్రౌండ్‌లో భారీ బ్లాక్‌ బస్టర్లుండాలి. బాక్సాఫీస్‌ని షేక్‌ చేసే హిట్స్‌ ఉంటేనే స్టార్లు కాల్షీట్స్‌ ఇస్తారు. కానీ ఓ యంగ్‌మేకర్‌ మాత్రం ఇలాంటి బ్లాక్‌బస్టర్స్‌ ఏం లేకుండానే స్టార్‌ హీరోస్‌ని ఇంప్రెస్‌ చేస్తున్నాడు. భారీ సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు.

సాగర్‌ చంద్ర టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతున్నాడు. ఇండస్ట్రీ జనాలంతా ఈ దర్శకుడిది మామూలు అదృష్టం కాదని కాంప్లిమెంట్స్‌ ఇస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ భారీ మూవీస్ చేస్తున్నాడని మెగా, నందమూరి సినిమాలతో సాగర్‌ స్టార్‌ డైరెక్టర్‌ అయ్యే చాన్స్‌ కొట్టేశాడని మాట్లాడుకుంటున్నారు.

'అప్పట్లో ఒకడుండేవాడు' తర్వాత సాగర్‌ చంద్ర గురించి ఎవరూ పెద్దగా మాట్లాడుకోలేదు. అయితే నాలుగేళ్ల గ్యాప్‌ తర్వాత భారీ సినిమాతో ఎంట్రీ ఇచ్చి అందరినీ సర్‌ప్రైజ్‌ చేశాడు. సాగర్ చంద్ర, పవన్‌ కళ్యాణ్‌ని డైరెక్ట్‌ చేస్తున్నాడనే అనౌన్స్‌మెంట్‌తో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారాడు. మళయాళీ హిట్‌ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్‌తో పవన్‌ని డైరెక్ట్‌ చేస్తున్నాడు సాగర్ చంద్ర.

పవన్‌ కళ్యాణ్‌ సినిమా ఇంకా సెట్స్‌కి వెళ్లనే లేదు, అప్పుడే బాలక్రిష్ణతో సినిమా ఓకే చేసుకున్నాడట సాగర్ చంద్ర. 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌లో బాలక్రిష్ణ, సాగర్‌ సినిమా ఉంటుందని టాక్ వస్తోంది. అయితే ఇంతకుముందు బాలయ్య 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్‌లో నటిస్తాడని ప్రచారం జరిగింది. తర్వాత పవన్‌ కళ్యాణ్‌ సీన్‌లోకి వచ్చాడు. సో పవన్, బాలక్రిష్ణ సినిమాలతో సాగర్‌ స్టార్‌ డైరెక్టర్‌గా ప్రమోట్‌ అవుతాడేమో చూడాలి.

మొత్తానికి సాగర్ చంద్ర భారీ అవకాశాలే అందుకుంటున్నాడు. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో ఇపుడు అందరి నోళ్లలో నానుతున్నాడు. బాలకృష్ణతో సినిమా చేయబోతున్నాడంటే ఆయనకు అవకాశాలు ఎలా ఉన్నాయో దీన్ని బట్టే అర్థమవుతుంది. అంతేకాదు పవన్ కళ్యాణ్ తో సైతం ఆయన సినిమా చేయబోతున్నట్టు ప్రకటించేశాడు కూడా. నాలుగేళ్ల గ్యాప్‌ తర్వాత  సాగర్ చంద్ర సినిమాలు చేస్తుండటంతో సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.




మరింత సమాచారం తెలుసుకోండి: