టాలీవుడ్ ఇండ్రస్టీ లో కొన్నాళ్ల పాటు అగ్ర తారగా ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ తమన్నా. తన అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ అమ్మడికి ఇప్పుడు సినిమా అవకాశాలు అంతగా రావడం లేదు. టాలీవుడ్ లో అగ్ర హీరోలు అయిన ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లాంటి మరెందరో టాప్ స్టార్స్ తో నటించి స్టార్ స్టేటస్ ని కైవసం చేసుకుంది తమన్నా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో యువ హీరోయిన్లు చూపిస్తున్న జోరుకో.. లేక తమన్నా కి తగ్గ కథలు దొరకకపోవడం వల్లో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈమె తెలుగులో అంతగా రాణించలేక పోతోంది. అయితే ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న తమన్నాకు వారి అభిమానులు ఆమెను ముద్దు పేరుతో పిలుస్తుంటారు.

 ఆమె  అభిమానులు తమన్నాను ముద్దుగా మిల్కీ బ్యూటీ అని పిలుస్తుంటారు. పాలలా తెల్లని మేనిఛాయ కలిగిన ఈ ముద్దుగుమ్మను మిల్కీ బ్యూటీ అని పిలుస్తుంటారు ఫ్యాన్స్. అయితే ఆ పిలుపు ఈ అమ్మడికి నచ్చదట. తాజాగా తమన్నా మాట్లాడుతూ.. 'అభిమానులు మంచి ఉద్దేశంతోనే మిల్కీ బ్యూటీ అని పిలుస్తున్నా..నాకు ఆ పిలుపు నచ్చదు. శరీర రంగును బట్టి తప్పు అని నా అభిప్రాయం అంటూ చెప్పుకొచ్చింది. మనదేశంలో అందమైన చర్మం పట్ల అభిమానం, వ్యామోహం ఉన్న వారు చాలా మంది ఉన్నారు. ఇలా ఒంటి రంగును బట్టి పిలవడం కొన్నిసార్లు వర్ణవివక్షకు దారితీస్తుంది.వారి ప్రతిభను బట్టి ముద్దు పేర్లు పెడితే బాగుంటుందని తెలిపింది తమన్నా.

 ప్రస్తుతం  తమన్నా గోపీచంద్ సరసన సీటీమార్ సినిమాలో నటిస్తుంది.సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోంది.స్షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక ఇటీవలే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన f2  సినిమాలో వెంకటేష్ సరసన నటించిన తమన్నా..ఇప్పుడు f2 కు సీక్వెల్ గా వస్తున్న f3 మూవీలో  కూడా ఈ మిల్కీబ్యూటీనే రిపీట్ అవుతోంది.అంతేకాకుండా ప్రముఖ ఓ. టీ. టీ. ప్లాట్ ఫాం ప్లాన్ చేస్తున్న ఓ వెబ్ సిరీస్ లో కూడా నటించడాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట తమన్నా...!!

మరింత సమాచారం తెలుసుకోండి: