రవితేజ ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. తప్పకుండా ఈ సినిమా మాస్ రాజా ఫ్యాన్స్ ను అలరిస్తుందని అంటున్నారు. 2021 సంక్రాంతికి రవితేజ క్రాక్ రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే ఆ డేట్ కు అనుకున్న కొన్ని సినిమాలు రిలీజ్ చేస్తాయా లేదా అన్న కన్ ఫ్యూజన్ ఉంది. అయితే ఏ సినిమా వచ్చినా రాకున్నా రవితేజ క్రాక్ మాత్రం రిలీజ్ అవుతుందని మరోశారి అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో జరుపుకుంటున్న ఈ సినిమా బిజిఎం వర్క్ కూడా జరుపుకుంటుందని తెలుస్తుంది. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయడం పక్కా అంటున్నారు. ఈ ఇయర్ డిస్కో రాజా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశపరచిన రవితేజ సంక్రాంతికి మాత్రం పక్కా హిట్ బొమ్మ అందిస్తా అని కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ సినిమా హిట్ అటు డైరక్టర్ కు.. ఇటు హీరోకి చాలా అవసరమని చెప్పొచ్చు.