గణేష్ ఆచార్య వయసు 49. బరువు దాదాపు 200 కేజీలు. ఈ కొరియోగ్రాఫర్ బాలీవుడ్ స్టార్స్ అందరితో వర్క్ చేశాడు. 2018లో హిందీ మూవీ 'టాయ్‌లెట్’సినిమాలోని ‘గోరీ తూ లాత్ మార్’పాటకుగాను బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా జాతీయ అవార్డును అందుకున్నారు. చమేలీ సాంగ్‌తో కత్రినాకైఫ్‌ను మంచి డ్యాన్సర్‌ని చేశాడు. ఇక దువ్వాడ జగన్నాథమ్‌లో 'గుడిలో బడిలో ..' అంటూ స్లో మూమెంట్స్‌తో మెప్పించాడు. వెయిట్ ఎంత ఉన్నా.. మాంచి ఈజ్‌తో డ్యాన్స్ చేసేవాడు ఆచార్య.
కపిల్ శర్మ షోకు గణేష్ ఆచార్య ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ప్రోమో రిలీజ్ చేయగా.. ఆచార్యను చూసి అందరూ షాక్ అయ్యారు. ఏడాదిన్నర కాలంలో 98 కేజీలు తగ్గినట్టు చెప్పాడు. ప్రతి రోజూ క్రమం తప్పకుండా.. జిమ్‌లో సాధన చేయడంతో... ఇన్ని కేజీలు తగ్గానని చెప్పుకొచ్చాడు ఈ క్రేజీ కొరియో గ్రాఫర్.
ప్రభుదేవాతో కలిసి నటించిన 'ఎబిసిడి' మూవీలో గణేష్ ఆచార్య లావుగానే ఉన్నాడు. 2015లో వచ్చిన 'హే బ్రో' మూవీ కోసం 40 కేజీలు తగ్గిన ఆచార్య... మొత్తం మీద 98 కేజీలు తగ్గి సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు. మొత్తానికి కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య 98కేజీలు తగ్గి ఆశ్చర్యపరిచాడు. ఈ విషయాన్ని ఓ టీవీ షోలో చెప్పి జనాలను నోరెళ్లబెట్టేలా చేశాడు. ఏడాదిన్నర క్రితం గణేశ్ దాదాపు 200కేజీల బరువున్నాడు ఇపుడు మాత్రం ఏకంగా 98కేజీలు తగ్గి షాక్ కు గురిచేశాడు. క్రమం తప్పకుండా వర్కవుట్ చేయడంతోనే తాను 98కేజీలు తగ్గినట్టు క్లారిటీ ఇచ్చేశాడు.