ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఆ బాలికను దత్తత తీసుకున్నారు."మంచి మనిషి జన్మదినాన ఒక మంచి పని.. మన అందరి ప్రియతమ నేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ అన్న పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి పనికి శ్రీకారం చుట్టడం జరిగింది. పి. పుష్ప కుమారి అనే ఈ చిన్నారిని పూర్తి చదువుకు నేను దత్తత తీసుకోవడం జరిగింది అని " రోజా ట్వీట్ చేశారు.అంతేకాదు ఓ లేఖను కూడా రాశారు."పుష్పకుమారి అనే ఈ చిన్నారి తన బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. కానీ డాక్టర్ అవ్వాలనే తన ఆశయాన్ని మాత్రం వదులుకోలేదు.
మన పిల్లలు చదువుకోవాలి అందులోనూ మరి ముఖ్యంగా ప్రతి ఆడపిల్ల తప్పనిసరిగా విద్యాపరంగా ఎదగాలి అని నమ్మే జగనన్న జన్మదినం సందర్భంగా ఈ చిన్నారి పూర్తి చదువుకు నేను దత్తత తీసుకోవడం జరిగింది. మనకు నచ్చిన వారి పుట్టిన రోజున కేవలం బొకేలు ఇవ్వకుండా ఒక బంగారు తల్లి భవిష్యత్తుకి బాట వెయ్యడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.విద్యకు పెద్ద పీట వేస్తూ ఎంతో మంది చిన్నారులకు మేనమామగా మారిన మన జగనన్నకు ఇదే నా పుట్టిన రోజు బహుమతి.. హాపీ బర్త్‌డే జగనన్న అంటూ" ఆ లేఖలో రాసుకొచ్చారు రోజా.ఇక రోజా చేసిన పనిని తెలిసిన ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు...!!