ప్రస్తుతం టాలీవుడ్ లోనే బిగ్ స్టార్ గా కొనసాగుతున్నప్పటికీ మెగాస్టార్ చిరంజీవి ఎంతో మంది యువ నటులు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే ఇక ఈ మధ్య కాలంలో వివిధ షో లలో కూడా ఎంతో హుషారుగా కనిపిస్తున్నారు. ఇక ఇటీవలే అక్కినేని వారి కోడలు సమంత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో సామ్ జామ్ లో డిజిటల్ వేదికపై దూసుకుపోతుంది. ఎంతో మంది సెలబ్రెటీలను సమంత ఇంటర్వ్యూ చేస్తుంది. ఇక ఇటీవల మెగాస్టార్ చిరంజీవిని ఇంటర్వ్యూ చేసింది సమంత. ఇక సమంత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోలో స్పెషల్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన మాటలతో ఆకట్టుకున్నారు.
ఇక ఇటీవలే ఈ షోకి సంబంధించిన మరో ప్రోమో సోషల్ మీడియాలో విడుదలవ్వగా ఇది కాస్త ప్రేక్షకులను తెగ ఆకర్షిస్తోంది. ఈ ప్రోమో చూస్తే షో పై మరింత ఆత్రుత పెంచేస్తోంది. ఇక ఈ ప్రోమో లో భాగంగా.. వైవా హర్ష ఎంట్రీ ఇచ్చి మెగాస్టార్ చిరంజీవి ని ఒక ప్రశ్న అడుగుతాడు.. మీరు ఇప్పటికే ఎన్నో హిట్ సినిమాలు చేశారు ఒకవేళ అవి రీమేక్ చేయాలి అంటే మీ పాత్రలో ఏ యువహీరో నటిస్తే బాగుంటుంది అంటూ ప్రశ్న అడగ్గానే వెంటనే స్పందించిన చిరంజీవి... చరణ్ తారక్ బన్నీ మహేష్ రవితేజ విజయ్ దేవరకొండ పవన్ కళ్యాణ్ అంటూ వరుసబెట్టి ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోల అందరి పేర్లు చెప్పి ఆశ్చర్యపరిచాడు.