పవన్ కళ్యాణ్ మూడ్ ను తట్టుకోవడం చాల కష్టమైన పని అంటూ ఉంటారు. ఈ మూడ్స్ వల్లనే పవన్ రాజకీయాలలో పెద్దగా రాణించలేకపోయారు అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి. అయితే పవన్ కు ఉన్న క్రేజ్ చెక్కు చెదరక పోవడంతో ఇండస్ట్రీలో ఇప్పటికీ అతడికి అవకాశాలు రావడమే కాకుండా అతడు డేట్స్ ఇస్తే చాలు 50 కోట్ల పారితోషికం ఇవ్వడానికి ఎందరో నిర్మాతలు ఇప్పటికీ క్యూలో ఉన్నారు.


ఇలాంటి పరిస్థితులలో పవన్ వరసపెట్టి సినిమాలు ఒప్పుకోవడంలో చూపెడుతున్న ఆశక్తి ఆ సినిమాలను పూర్తి చేయడంలో ఉత్సాహం కనపడటం లేదు అంటూ కొందరు ఇండస్ట్రీలో కామెంట్స్ చేస్తున్నారు. దీనికి కారణం ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ‘వకీల్ సాబ్’ షూటింగ్ అని అంటున్నారు.


మూవీ షూటింగ్ ఇంకా చాల పెండింగ్ లో ఉందని లీకులు వస్తున్నాయి. ఈ మూవీకి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ సీన్స్ చిత్రీకరణ ఇంకా చాల పెండింగ్ లో ఉందని టాక్. అదేవిధంగా ఈ మూవీకి సంబంధించి పవన్ శృతి హాసన్ లపై  పొలాచీలో చిత్రీకరించ వలసిన సాంగ్ ఇంకా పెండింగ్ లో ఉందని తెలుస్తోంది.


మూవీ షూటింగ్ కు సంబంధించి దిల్ రాజ్ పవన్ ను కలిసినప్పుడల్లా షూటింగ్ కు రానని చెప్పడని అయితే ఆఖరి నిముషంలో ఎదో ఒక కారణం చెప్పి షూటింగ్ ను వాయిదా వేస్తూ ఉంటాడు అన్న గాసిప్పులు హల్ చల్ చేస్తున్నాయి. ఈమూవీతో పాటు ప్రారంభం అయిన క్రిష్ మూవీ పూర్తి కాకుండానే ‘అయ్యప్పన్ కొషియం’ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా ఈ మూవీ షూటింగ్ ను జనవరి నుంచి మొదలుపెడతాను అని పవన్ చెపుతున్న మాటలను బట్టి సినిమాలు ఒప్పుకోవడంలో చూపించే స్పీడ్ సినిమాలు పూర్తి చేయడంలో ఎందుకు ఆలస్యం అవుతోంది అంటూ పవన్ మూడ్ ను అర్ధం చేసుకోలేక అతడితో సినిమాలు చేస్తున్న దర్శకనిర్మాతలు తలపట్టుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: