బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమా చేస్తున్నాడంటే స్టార్ క్యాస్టింగ్ భారీగానే ఉంటుంది. టాప్ హీరోయిన్‌తో స్టెప్పులెయ్యాలి, ఫామ్‌లో ఉన్న విలన్‌ని తీసుకురావాలి, మరో స్టార్ హీరోయిన్‌తో ఐటెమ్ సాంగ్ చేయించాలి అన్నట్లు ఉంటుంది. దీనికి తగ్గట్లుగానే 'అల్లుడు శీను, స్పీడున్నోడు' సినిమాల్లో తమన్న స్పెషల్ సాంగ్ చేసింది.
బెల్లంకొండ 'జయజానకినాయక' సినిమాలో కేథరీన్‌తో స్పెషల్ సాంగ్ చేసింది. అలాగే 'సీత' సినిమాలో పాయల్ రాజ్‌పుత్ స్పెషల్ సాంగ్ చేసింది. ఇలా ప్రతీ సినిమాకి ఒక హీరోయిన్‌తో ఐటెం సాంగ్ చేయించే బెల్లంకొండ ఇప్పుడు 'అల్లుడు అదుర్స్'కి బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్‌ని తీసుకొస్తున్నాడనే టాక్ వస్తోంది. హిందీ 'కెజిఎఫ్'లో స్పెషల్ సాంగ్ చేసిన మౌనీరాయ్ ఉంటే సినిమాకి ప్లస్ అవుతుంది అనుకుంటున్నాడట.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నెక్ట్స్ బాలీవుడ్‌కి వెళ్తున్నాడు. వి.వి.వినాయక్ డైరెక్షన్‌లో 'ఛత్రపతి' రీమేక్‌తో ముంబాయిలో అడుగుపెడుతున్నాడు. అందుకే ఇప్పటినుంచే బాలీవుడ్‌ని ఫోకస్ చేస్తున్నాడట బెల్లంకొండ. మరి బాలీవుడ్‌కి వెళ్లకముందే ముంబాయి రేంజ్‌లో ఆలోచిస్తోన్న బెల్లంకొండ, మున్ముందు ఇంకెలా ప్లాన్ చేస్తాడో, ఎలాంటి స్టార్స్‌ని తీసుకొస్తాడో అని మాట్లాడుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు.
మొత్తానికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ఆలోచనల్లో మునిగిపోయాడు. ఐటమ్ సాంగ్ కు ముంబయి హీరోయిన్ తీసుకొచ్చి తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఇప్పటికే తాను హీరోగా నటించిన అల్లుడు అదుర్స్ లో మౌనీరాయ్ తో స్పెషల్ సాంగ్ చేయించాడు. ఇక కెజిఎఫ్ హిందీ వెర్షన్ లో మౌనీరాయ్ ఐటం సాంగ్ చేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. చూద్దాం.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రయత్నాలు ఎంతవరకు వస్తాయో.