
బిగ్ బాస్ సీజన్ ఫైనల్ విన్నర్ ను నిర్ణయించడానికి సంబంధించి 14 కోట్ల ఓట్లు వచ్చాయి అని నాగార్జున చెపుతూ ఉంటే ఈషో పరమ చెత్త అంటూ నారాయణ కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. నిన్న ఆదివారం తిరుపతిలో నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది.
గతంలో నాగార్జున సినిమాలు తాను చాల చూశానని ఆయన నటన అంటే తనకు ఇష్టం అని చెపుతూ అలాంటి గొప్ప నటుడు ఇలాంటి చెత్త కార్యక్రమానికి ఎందుకు హోస్ట్ గా వ్యవహరించాడో తనకు అర్ధం కావడంలేదు అంటూ కామెంట్స్ చేసాడు. బిగ్ బాస్ షోలో ముగ్గురు యువతుల ఫొటోలు పెట్టి ఒక హౌస్ మేట్ ని ఎవర్ని కిస్ చేస్తావు? ఎవరితో డేటింగ్ చేస్తావు? ఎవర్ని పెళ్లి చేసుకుంటావని బహిరంగంగా నాగార్జున అడిగిన ప్రశ్న విని తాను షాక్ అయ్యానని ఇదే విధంగా తన కుటుంబంలోని మహిళల నటుల ఫొటోలు పెట్టి అడగ్గలడా అంటూ నారాయణ నాగార్జునను సూటిగా ప్రశ్నించారు.
అంతేకాదు పద్దతిగా ఉండే నాగార్జున ఎందుకు ఇలా చేస్తున్నారో తనకు అర్ధం కావడం లేదనీ ఈ విషయమై కిందిస్థాయి కోర్టుల్లో కేసులు తీసుకోలేదని నారాయణ ఆవేదన వ్యక్త పరిచారు. మన దేశంలో మహిళలను గౌరవించే సంస్కృతి తరతరాల నుండి వస్తోందని దీనితో బిగ్ బాస్ లాంటి దిగజారుడు కార్యక్రమాలను హోస్ట్ చేయవద్దని టాప్ హీరోలకు నారాయణ సలహాలు ఇస్తున్నారు. అంతేకాదు ఈషో పై హైకోర్టులో కేసు వేస్తానని నారాయణ అంటున్నారు. అంతేకాదు తెలుగు సమాజానికి నాగార్జున క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అయితే బిగ్ బాస్ షోకు యువత నుండి అన్ని వర్గాల ప్రజలనుండి విపరీతమైన స్పందన వచ్చిన పరిస్థితులలో నారాయణ ఆవేదనను ఎవరు పట్టించు కుంటారు అన్నది సమాధానం లేని ప్రశ్న..