అదేంటో గానీ.. రజినీకాంత్ కు రాజకీయ పార్టీకి లింక్ కుదరడం లేదు. రాజకీయాల్లోకి ఎప్పుడు రావాలని చూసినా.. ఏదో ఒక అడ్డంకి వస్తోంది. ఈ నెల 31న పార్టీ ప్రకటిస్తానని చెప్పి.. అభిమానులను ఖుషీ చేయించిన రజినీకాంత్ యూటర్న్ తీసుకొని నో పాలిటిక్స్ అని చెప్పడం అభిమానులకు షాక్ ఇచ్చింది. పార్టీ ప్రకటించకుండానే సూపర్ స్టార్ పొలిటికల్ కెరియర్ కు తెరపడింది.

రాజకీయ అరంగేట్రంపై సంచలన ప్రకటన చేశారు రజినీకాంత్. అయితే రాజకీయాలతో సంబంధం లేకుండా తన ప్రజాసేవ కొనసాగుతుందని వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అభిమానులకు మూడు పేజీల లేఖ విడుదల చేశారు. ఆరోగ్యం ప్రధానమని ఆత్మీయులు సూచించడం కోవిడ్ పరిస్థితుల్లో పార్టీ ప్రారంభించ కూడదన్న నిర్ణయాన్ని ఎంతో భారమైన హృదయంతో ప్రకటిస్తున్నట్టు తెలిపారు. అనారోగ్యం భారిన పడటాన్ని దేవుని సూచనగా భావిస్తున్నానని అన్నారు రజినీకాంత్.

సోషల్ మీడియా ప్రచారంతో ఏ పార్టీ కూడా గెలవదనీ.. తన నిర్ణయం అభిమానులను విపరీతంగా బాధపెట్టి ఉండొచ్చన్నారు రజినీకాంత్. అందుకు క్షమాపణలు చెబుతున్నానని లేఖలో పేర్కొన్నారు రజినీకాంత్.

ఒకరంగా రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీని కరోనా అడ్డుకుందనే చెప్పాలి. తలైవా ప్రస్తుతం నటిస్తున్న అన్నాత్తై షూటింగ్ హైదరాబాద్ లో మొదలయ్యింది. ఎలక్షన్స్ ముందే సినిమా రిలీజ్ అయ్యేలా నలభై ఐదు రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. పదిరోజుల్లో ఏడుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. రజినీకి నెగిటివ్ వచ్చినా.. బ్లడ్ ప్రెజర్ లో హెచ్చుతగ్గులు ఉండటంతో ఆస్పత్రిలో రజినీకాంత్ జాయిన్ అయ్యారు. సూపర్ స్టార్ పొలిటికల్ ఎంట్రీ క్యాన్సిల్ తో పాటు సినిమా ల సంఖ్య కూడా తగ్గనుంది.  

కరోనా పరిస్థితుల్లో మళ్లీ అన్నాత్తై మొదలై పూర్తయితే చాలు రజినీకి గతంలో కిడ్నీ ప్లాంటేషన్ జరిగింది. ఇతరత్రా సమస్యలు ఆయన్ని ఇబ్బంది పెడుతున్నాయి. డాక్టర్ల సూచన మేరకు సినిమాలు కూడా తగ్గిస్తారు అని తెలిసింది. వరుస సినిమాలు చేస్తే ఆరోగ్యం అనే వంకతో రాజకీయాల్లోకి రాకుండా సినిమాలు చేస్తున్నారని అభిమానులే ఫీలవుతారు. ఏది ఏమయినా.. దేవుడు ఏది ఆదేశిస్తాడో.. దాన్నే రజినీ పాటిస్తాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: