అంతేకాదు బిగ్ బాస్ కు ముందు ఆమెని మర్చిపోయిన దర్శక నిర్మాతలు బిగ్ బాస్ లో ఆమె క్రేజ్ చూసి మళ్లీ అవకాశాలు ఇస్తున్నారు. బిగ్ బాస్ నుండి రావడమే స్టార్ మా డ్యాన్స్ ప్లస్ షోలో ఆమెని జడ్జ్ గా కూర్చోపెట్టారు. ఇక లేటెస్ట్ గా బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమాలో స్పెషల్ సాంగ్ కు ఛాన్స్ ఇచ్చారు. ఈ ఆఫర్లు చూస్తుంటే బిగ్ బాస్ వల్ల మోనాల్ కు మొదట లక్కీ ఛాన్సులు వస్తున్నాయని చెప్పాలి.
తనకు వచ్చిన ఈ క్రేజ్ ను మోనాల్ కూడా వెంటనే వినియోగించుకుంటుంది. అయితే మునుపటిలా కొద్దిగా సన్నబడితే మాత్రం ఆమెకు మళ్లీ తెలుగులో హీరోయిన్ ఛాన్సులు వస్తాయని అంటున్నారు. ఛాన్సులు రావట్లేదని డైట్ కంట్రోల్ చేయలేదనుకుంట అందుకే బొద్దుగా మారింది మోనాల్. మరి మోనాల్ తిరిగి కెరియర్ మీద దృష్టి పెట్టి టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తే బిగ్ బాస్ లో ఆమె ఫాలోవర్స్ అంతా ఫుల్ ఖుషి అవుతారని చెప్పొచ్చు.