టాలీవుడ్ లోని హీరోలందరూ సొంతంగా నిర్మాణ సంస్థలు పెట్టి వరుసగా సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.. రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ ఇలా చాలామంది పెద్ద హీరోలు సినిమాలను నిర్మిస్తూ నిర్మాణ రంగంలో కూడా తమదైన ముద్ర వేస్తున్నారు. మహేష్ బాబు కూడా ఇటీవలే సినిమా నిర్మాణ రంగంలోకి దిగగా ఇప్పటికే అడవి శేష్ హీరోగా మేజర్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు.. ఇకపోతే రామ్ చరణ్ తన తండ్రి చిరు హీరోగా తాను నిర్మాత గా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా ఉన్నాడు. ఇక అయన హీరోగా rrr సినిమా లో చేస్తున్న విషయం తెలిసిందే..
రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె రామ్ చరణ్ తేజ్ కి జోడిగా నటిస్తుంది.. రామ్ చరణ్ తేజ్ ఈ సినిమాలో అల్లూరి సీత రామరాజు పాత్రలో నటిస్తుండగా అలియా సీత పాత్ర లో నటిస్తుంది.. లాక్ డౌన్ తర్వాత మొదలైన ఈ సినిమా షూటింగ్ లో ఇటీవలే అలియా భట్ చేరింది.. అయితే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ఎవరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడో ఇంకా క్లారిటీ రాలేదు..తాజా సమాచారం ప్రకారం జెర్సీ సినిమా తో మంచి హిట్ కొట్టిన గౌతమ్ తో రామ్ చరణ్ సినిమా చేయనున్నాడని తెలుస్తుంది..
ఆర్ఆర్ఆర్, ఆచార్యల తో బిజీగా ఉన్న చెర్రీ కూడా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదంటే ఇప్పటిదాకా చెప్పలేదు. ఫైనల్ గా గౌతమ్ స్క్రిప్ట్ నే లాక్ చేసినట్టు వినికిడి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీనికి ఎన్వి ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తారట. లూసిఫర్ రీమేక్ లోనూ ఈయన భాగస్వామిగా ఉన్నారు. ఇదేదో వరస జాక్ పాట్ లా కనిపిస్తోంది. ఇదంతా ఓ కొలిక్కి రావడానికి 2021 వేసవి పడుతుంది. రామ్ చరణ్ ఆలోగా తన రెండు సినిమాలు పూర్తి చేసుకుని ఫ్రీ అవుతాడు. అయితే గౌతమ్ రూపొందించబోయే మూవీ మాత్రం ఎంటర్ టైన్మెంట్ అండ్ ఎమోషన్ తో సాగుతుందట. వినయ విధేయ రామ తర్వాత చరణ్ చేస్తున్న ఆర్ఆర్ఆర్, ఆచార్య రెండూ కమర్షియల్ బ్యాక్ డ్రాప్ లో ఉన్నాయి కాబట్టి ఇలాంటి సబ్జెక్టు అయితేనే బాగుంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది.