పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,  దగ్గుబాటి రానా కలిసి  నటించనున్న లేటెస్ట్ సినిమా కు సంబంధించి ఇటీవల అధికారిక పూజ కార్యక్రమాలు జరిగాయి .పవన్ కు వీరాభిమాని అయిన సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న విషయం తెలిసిందే. ఇటీవల మలయాళంలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టిన అయ్యప్పనుం కోషియం సినిమాకి అధికారిక తెలుగు రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కనుంది.ఇక ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా అందుకు దీటుగా రానా కూడా అదిరిపోయే పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

తమన్ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల ఎంపిక ఇప్పటికే ప్రారంభమైందని సమాచారం. మరోవైపు తొలిసారిగా పవన్, రానాల కలయికలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఇటు మెగా ఫ్యాన్స్ తో పాటు అటు దగ్గుబాటి ఫ్యాన్స్ లో కూడా ఈ మూవీపై తారాస్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. అప్పట్లో ఒకడుండేవాడు మూవీ తో మంచి సక్సెస్ అందుకుని విమర్శకుల నుండి కూడా ప్రశంసలు దక్కించుకున్న సాగర్ చంద్ర, అయ్యప్పనుం కోషియం మూవీ స్టోరీని మన సినిమా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించనున్నట్లు టాక్. ఇక పవన్ ఫ్యాన్స్ అలానే రానా ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను ఆయన తీయనున్నాడట.

ఇక ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా షూటింగ్ జనవరి మూడో వారంలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇప్పటికే మూవీకి సంబంధించి ఒక భారీ సెట్ ని రామోజీ ఫిలిం సిటీ లో రూపొందిస్తున్నారని, మూవీ యూనిట్ అతి త్వరలో దాన్ని కంప్లీట్ చేయనుందని ఇక అదే సెట్లో దాదాపుగా 40 శాతం షూటింగ్ పూర్తి చేయనున్నారని అంటున్నారు. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాని వచ్చే ఏడాది దసరా కానుకగా రిలీజ్ చేయనున్నట్లు  టాక్. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తకు సంబంధించి యూనిట్ నుండి అధికారిక వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: