సమంత అడిగిన ఎన్నో ప్రశ్నలకు బన్నీ సమాధానాలు చెప్పాడు. ఆ క్రమంలో బన్నీ తన వ్యక్తిగత విషయాలు, కుటుంబ సంగతులు, చిన్ననాటి అల్లరి పనులు ఇలా ఎన్నింటి గురించో చెప్పాడు. తన పిల్లలపై ప్రేమ, భార్యపై ఉన్న ప్రేమను బయట పెట్టేశాడు.అయాన్ గురించి బన్నీ మాట్లాడుతూ.. నాకు అయాన్ అంటేనే ఇష్టం.. అయాన్‌తోనే ఎక్కువగా ఉంటాను.. కానీ అయాన్‌కు కెమెరాలన్నా, ఫోటోలు తీయడమన్నా నచ్చదు. కానీ అర్హ మాత్రం వెంటనే వచ్చేస్తుంది.. అందుకే అన్ని ఫోటోలు అర్హతోనే ఉంటాయి.. అందరూ అర్హ అంటేనే ఇష్టమని అనుకుంటారు.. కానీ అయాన్ అంటేనే ఇష్టమని చెప్పుకొచ్చాడు.అల్లు స్నేహారెడ్డిలో మీకు నచ్చింది ఏమిటి అని సమంత బన్నీని అడిగింది. ఆమెలో డిగ్నిటీ నాకు చాలా నచ్చిందంటూ బన్నీ ఓ విషయాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు.
నేను మొదటి సారిగా స్నేహాను నైట్ క్లబ్ పార్టీలో చూశాను అంటూ మొదటి చూపుల గురించి చెప్పాడు.నైట్ క్లబ్ పార్టీలో చూశాను.. అంత మందిలోనూ ఎంతో డిగ్నిటీగా కనిపించింది.. రాత్రి రెండు అవుతున్నా కూడా అంతే పద్దతిగా కనిపించింది.. ఏ మాత్రం అసభ్యకరంగా కనిపించలేదు.. తనలో నాకు అదే నచ్చింది అంటూ స్నేహారెడ్డి గురించి బన్నీ చెప్పుకొచ్చాడు..ఇక ఈ ఫుల్ ఎపిసోడ్ ఆహా లో స్ట్రీమింగ్ అవుతుంది.. ఇక బన్నీ ప్రస్తుతం..సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తున్నాడు.. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతుంది...!!