కొత్త ఏడాదిలో అందరు థియేటర్లకు  వచ్చి సర్ ప్రైజ్ చేద్దామనుకుంటే..తేజు ఓటీటీలోకి  ఫ్యాన్సీ టికెట్ ప్రైజ్ తో వచ్చి  ఆడియన్స్ కు షాక్ ఇచ్చాడు.ఒక్కసారిగా తేజు ఇచ్చిన ధమ్కీతో  మెగా అభిమానులు ఖంగుతిన్నారు.

గత ఏడాదికి ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి అన్నట్లుగా సోలో బతుకే సో బెటర్ ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ ఫిలిం కు ఫస్ట్ డే వచ్చిన ఆక్యుపెన్సీ చూసి పరిశ్రమ సంతోషపడింది. తేజుతో క్లోజ్ గా మూవ్ అయ్యే హీరోలు కూడా ఈ
సినిమాకు సోషల్ మీడియా వేదికగా ప్రమోషన్ చేసిపెట్టారు. దీంతో ఆడియన్స్ ఈ ఫిలింను ఏదో గేమ్ చేంజర్ మూవీగా ట్రీట్ చేశారు.

డిసెంబర్ 25న పెద్ద పండగనాడు వచ్చిన సోలో బతుకు... శనివారం రోజు ఆక్యుపెన్సీని కోల్పోయింది. ఆదివారం మళ్లీ సర్ధుకున్నప్పటికీ... సోమవారంకు థియేటర్ లో జనాలు లేని పరిస్థితిని తెచ్చుకుంది. దీనికి తోడు సోషల్ మీడియాలో ప్రమోషన్ అవసరం లేదనుకుని స్టార్స్ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ లతో యూనిట్ సంతృప్తి చెందింది. 400 ప్లస్ థియేటర్ లో  రిలీజ్ అయిన ఈ ఫిలిం ఇప్పటివరకు 15కోట్లను కూడా వసూల్ చేయలేకపోయింది. దీంతో ఇక లాభం లేదనుకొని ఇప్పుడు ఓటీటీకి ఇచ్చేశారు.

సోలో బతుకే సో బెటర్ ను "జీ5"కు ఫ్యాన్సీ రేట్ కు అమ్ముకున్నారు. థీమ్ బాగున్నప్పటికీ ట్రీట్ మెంట్ సరిగా లేకపోవడంతో ఫిలిం చూసిన ఆడియన్స్  ఫ్రెండ్స్ కు ఈ ఫిలింను రిఫర్ చేయలేకపోయారు. ఇక ఓటీటీలో పెట్టారు కదా
అని చెప్పి ఫ్రీగా చూద్దామనుకుంటే దీనికి ప్రత్యేకంగా 149రూపాయలు టికెట్ కార్డ్ అతికించారు. అంటే ఓటీటీలో ఏటీటీ కాన్సెప్ట్ అన్నమాట. ఏదో ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ ..కుదరకపోతే  ఆహా కిచ్చిన జనాలు చూసేవారు. అలాంటిది తెలుగు సబ్ స్క్రైబర్లు అంతగా లేని జీ5కు ఇవ్వడంతో  అసలు సినిమా ఎంతమందికి రీచ్ అవుతుంది అనే సందిగ్ధం నెలకొంది. కరెక్ట్ గైడెన్స్ లేకనే సోలో బతుకు సో బెటర్ ఇలాంటి స్టెప్స్ వేస్తుందని పరిశ్రమలో విమర్శలైతే వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: