ఇక ఫైనాన్షియర్ల నుంచి ఒత్తిళ్లు కూడా తప్పవు. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేసే ఓ హీరో పరిస్థితి కూడా ఇప్పుడు ఇలాగే ఉందట. ఆ హీరోకు ఏకంగా రు. 50 కోట్ల అప్పులు ఉన్నాయంటున్నారు. అనేక కారణాల వల్ల ఆ హీరో భారీగా అప్పులు చేసి కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నాడని అంటున్నారు. చేసిన అప్పులు.. వాటికి వడ్డీలు.. మరి కొన్ని సార్లు తన సినిమాల రిలీజ్ విషయంలో ఫైనాన్షియర్లకు తాను గ్యారెంటీగా ఉండడం.. వాటిని కూడా ఒక్కోసారి తాను కట్టాల్సి రావడం లాంటి కారణాలతో ఆ స్టార్ హీరో అప్పులు భారీగా పెరిగిపోయాయంటున్నారు.
ఇండస్ట్రీ వర్గాల ప్రకారం సదరు హీరో అప్పులు రు. 50 కోట్ల పై మాటే అని అంటుంటే. మరి కొందరు మాత్రం అవి రు. 70 నుంచి 80 కోట్ల వరకు ఉంటాయంటున్నారు. పోనీ వరుసగా సినిమాలు చేసి ఆ అప్పులు తీర్చేసుకుందామా ? అని అనుకుంటే ఆ హీరోతో సినిమాలు తీసే వాళ్లే లేరు. తన బ్యానర్లో తానే సినిమాలు చేసుకోవాలి. తానే నిర్మాతగా ఉండాలి. ఇక ఆ హీరో సినిమాల్లో క్రేజీ హీరోయిన్లను పెట్టి వాళ్లకు కోట్లలో రెమ్యునరేషన్లు ఇస్తాడన్న టాక్ కూడా ఉంది. ఈ భారీ అప్పుల గండం నుంచి సదరు హీరో ఎప్పుడు గట్టెక్కుతాడో ? చూడాలి.