పూజా వెంటనే ఆమె సోషల్ మీడియా అక్కౌంట్ హ్యాక్ అయ్యిందని చెప్పింది. సమంతపై తాను చేసిన మెసేజ్ కి తనకు సంబంధం లేదని చెప్పింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పూజా హెగ్డేను టార్గెట్‌గా చేసుకుని అభిమానులు నానా రచ్చ రచ్చ చేశారు. పూజా అభిమానులు వర్సెస్ సమంత అభిమానుల మధ్య యుద్ధం మామూలుగా జరగలేదు. ఆ తర్వాత మరోసారి ఈ అభిమానులు ఒకరిని మరొకళ్లు టార్గెట్‌గా చేసుకున్నారు.
ఈ వివాదం కాస్త చల్లారింది అనుకుంటోన్న టైంలో మరోసారి సమంత పూజా హెగ్డే అభిమానుల మద్య రచ్చ మొదలైంది. ఒక హీరోయిన్ అభిమానులు మరో హీరోయిన్ అభిమానులపై విమర్శలు చేయడం దగ్గర నుంచి... ట్రోల్స్ మీమ్స్ షేర్ చేయడం నుంచి ఇష్టమొచ్చినట్టు ఆటలాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సమంతను ప్లాస్టిక్ ఫేస్ అంటూ పూజా ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.
ఈ ప్లాస్టిక్ ఫేస్‌కు అంత సీన్ లేదమ్మా ? అని వారు కామెంట్ చేస్తుంటే దానికి బదులుగా సమంతా ఫ్యాన్స్ కూడా పూజాను టార్గెట్ చేసుకుని ట్రోల్స్ వదులుతున్నారు. ఈ గొడవ ఎప్పటకి ఆగుతుందో కాని... ఈ ఇద్దరు హీరోయిన్స్ ఫ్యాన్స్ మళ్లీ కొన్ని రోజులు ఢీ అంటే ఢీ అన్నట్లుగా కొట్టుకోవడం ఖాయంగా అనిపిస్తుంది.