చాలా కాలం క్రితమే వీరిద్దరూ ఒకరికొకరి అంగీకారంతో విడాకులు కూడా తీసేసుకున్నారు. తాజాగా ఈ అంశంపై సంపత్ రాజ్ నోరువిప్పాడు. తాము పెళ్లి చేసుకున్న సమయంలో కెరీర్ గురించి పెద్దగా ఆలోచించలేదని, ఆ తర్వాత కెరీర్‌పై మొత్తం దృష్టి పెట్టేనాటికి ఇద్దరి మధ్య గొడవలు రావడం మొదలయ్యాయని అన్నారు. ఇక గొడవలతో కలిసి జీవించడం కష్టమని అనుకుని విడాకులు తీసుకున్నట్టు చెప్పాడు. విడాకులు తీసుకున్నప్పటికి శరణ్యకు ఫోన్ చేసి మాట్లాడుతుంటూ ఉన్నానని అన్నాడు. వీరిద్దరికి కూతురు కూడా ఉండగా.. ఆమె బాధ్యతలను పూర్తిగా తానే తీసుకున్నట్టు చెప్పుకొచ్చాడు.
తన కూతురు చదువు కూడా పూర్తిచేసిందని, ప్రస్తుతం తనతోనే కలిసి ఉంటున్నట్టు చెప్పాడు. కాగా.. సంపత్ రాజ్ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో బిజీ నటుడుగా కొనసాగుతున్నారు. చాక్లెట్ బాయ్ రామ్ నటించిన రెడ్ చిత్రంలో సంపత్ రాజ్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంతో పాటు విక్టరీ వెంకటేష్ నటిస్తున్న నారప్ప చిత్రంలో సంపత్ రాజ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నట్టు సమాచారం.