ఇక సినిమా నుండి ఈమధ్యనే ఒక క్రేజీ పోస్టర్ రిలీజ్ చేయగా సంక్రాంతి కానుకగా జనవరి 9న ఉదయం 11:07 గంటలకు టీజర్ వస్తుందని తెలుస్తుంది. ఆల్రెడీ నానితో నిన్ను కోరి సినిమా చేసి హిట్ అందుకున్న శివ నిర్వాణ తన నాగ చైతన్యతో కూడా మజిలీ సినిమాతో హిట్ అందుకున్నారు. బ్యాక్ టూ బ్యాక్ హిట్లు కొట్టిన శివ నిర్వాణ ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు.
సినిమా కథ ఎలా ఉన్నా తన స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తున్న శివ నిర్వాణ తప్పకుండా నాని సినిమాతో మరో హిట్ కొట్టడం ఖాయమని అంటున్నారు. నానితో శివ ఈ సినిమా కూడా హిట్ అందుకుంటే మాత్రం శివ నిర్వాణ హిట్ మేనియా ఇలానే కొనసాగుతుందని చెప్పొచ్చు. తప్పకుండా నాని, శివ నిర్వాణ కాంబినేషన్ లో వస్తున్న టక్ జగదీష్ సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందని అంటున్నారు.