జూహూ ప్రాంతంలో శక్తి సాగర్ అనే పేరుతో సోనూ సూద్‌కి ఆరు అంతస్తుల భవనం ఉంది. నివాస భవనాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా సోనూ సూద్ హోటల్‌గా మార్చారని ఆరోపిస్తూ మహారాష్ట్ర రీజనల్ అండ్ టౌన్ ప్లానింగ్ నిబంధనలను సోనూ సూద్ ఉల్లంఘించినందున ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అయితే బీఎంసీ తనపై చేసిన ఆరోపణల్ని సోనూసూద్ ఖండించారు. తన దగ్గర అన్ని అనుమతులు ఉన్నాయని స్పష్టం చేశారు. మహారాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ నుంచి అనుమతులు రావాల్సి ఉండగా.. లాక్ డౌన్ వల్ల ఆలస్యమైందని ఒకవేళ అనుమతులు రాకపోతే దాన్ని తిరిగి నివాస సముదాయంగా మార్చేస్తామని వివరణ ఇచ్చారు. అయితే ఇది లీగల్ ఇష్యూ కావడంతో.. ప్రాథమిక దర్యాప్తు అనంతరం ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని ముంబై పోలీసులు తెలిపారు.
హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు మూడువారాల సమయం ఇచ్చింది. సమయం పూర్తి కావడంతో ప్రణాళిక ప్రకారం మార్పులు, చేర్పులు చేయకపోవడంతో ఎంఆర్‌పీటీ చట్టంకింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఓ బీఎంసీ అధికారి తెలిపారు. ఈ సందర్భంగా సోనుసూద్ స్పందిస్తూ.. భవనానికి అన్ని అనుమతులు ఉన్నాయని, ఎంసీజెడ్‌ఎంఏ అనుమతి కొవిడ్ కారణంగా రాలేదని తెలిపారు. మహమ్మారి సమయంలో కొవిడ్ యోధులను ఉంచేందుకు ఈ హోటల్ వినియోగించినట్లు తెలిపారు. అనుమతులు రాకపోతే, భవనాన్ని తిరిగి నివాసంగా మారుస్తానని చెప్పాడు.