తెలుగు చిత్ర పరిశ్రమలో  ప్రముఖ హాస్య నటులలో ఒకరైన  సునీల్  సుమారు 200 కి పైచిలుకు చిత్రాల్లో నటించాడు. మొదట నటించిన  చిత్రాలు "చిరునవ్వుతో "మరియు "నువ్వే కావలి'. మొదట విడుదల చేసిన  చిత్రం నువ్వే కావలి." ఈ సినిమాలో సునీల్ అద్భుతంగా నటించి మరిన్ని సినిమా అవకాశాలు వచ్చాయి.  "నువ్వు నాకు నచ్చావ్' మూవీ లో తన హాస్యం నటనతో అందర్నీ అలరించాడు. సునీల్  ప్రధాన పాత్రలో నటించిన "అందాలరాముడు"మూవీ లో ఆర్తీ అగర్వాల్ కథానాయిక.  ఈ చిత్రం విజయవంతం కావడంతో హీరోగా సునీల్ కు మంచి పేరు వచ్చింది. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన "మర్యాద రామన్న"  కూడా ప్రజాదరణ పొందింది.

పూల రంగడు, మిస్టర్ పెళ్ళికొడుకు, తడాఖా,  జక్కన్న, ఉంగరాల రాంబాబు వంటి చిత్రాల్లో నటించారు .అయితే కమెడియన్‌గా ప్రేక్షకాభిమానులను అలరించిన సునీల్‌.. హీరోగా మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయడు. హీరోగా  నటించినప్పటి నుంచి ఆయనకు  కలిసిరాలేదు. ఈ మధ్య కాలంలో ఆయన  "కలర్‌ ఫోటో' సినిమాలో సునీల్ విలనిజాన్ని బాగానే పండించారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ల వస్తున్న  ‘పుష్ప’ మూవీ లో ఆయన ఓ విలన్‌గా నటించనున్నట్లు వార్తలొచ్చాయి. మళ్లీ అదృష్టం తలుపు తట్టి త్వ‌ర‌లోనే హీరోగా వెండితెర‌పై సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు సునీల్.

ప్రస్తుతం సునీల్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం "వేదాంతం రాఘ‌వ‌య్య"  14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ఆచంట‌, గోపీ ఆచంట నిర్మాతలుగా, సి చంద్ర‌మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో  నిర్మిస్తున్నారు.  ఇందులో ప్రత్యేకత ఏమిటంటే  గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని అలరించిన హ‌రీష్ శంక‌ర్ ప్ర‌స్తుతం ఈ సినిమాకు క‌థ‌, మాటలు అందించి ఒక కొత్త దర్శకుడిని పరిచయం.  చేస్తున్నారని తెలుగు సినీ పరిశ్రమలో గట్టిగా వినిపిస్తోంది. "వేదాంతం రాఘ‌వ‌య్య‌" సినిమా శనివారం హైద‌రాబాద్‌లోని సంస్థ కార్యాల‌యంలో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి కొందరు ప్రముఖ హాజరైనట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: