‘ఫిదా’సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన బ్యూటీ సాయి పల్లవి. ఈ ముద్దుగుమ్మ డ్యాన్సర్ గా బుల్లితెరకు పరిచయమై.. హీరోయిన్ గా మాంచి పేరు తెచ్చుకుంది. ఇండస్ట్రీలోకి వచ్చే ప్రతి చిన్నది గ్లామరస్ షోలను చేయడానికి  ముందుంటుంది. కానీ సాయి పల్లవి అందుకు పూర్తి భిన్నంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే కదా ఈ బ్యూటీ క్వీన్ కు చాలా సినిమాల ఆఫర్లు వస్తున్నా.. నటనకు ప్రధాన్యమున్న సినిమాలకే ఓకే చెప్పుకుంటూ వెళుతోంది. తన దైన శైలిలో సెలెక్టెడ్ సినిమాలను చేసుకుంటూ వెళుతుంది అంటూ నెటిజన్లు ఆమె గురించి మాట్లాడుకునేలా చేస్తోంది సాయి పల్లవి. యాక్టర్ గా డ్యాన్సర్ గా సాయి పల్లవి ప్రేక్షకుల నుంచి మంచి ఇమేజ్ ను కూడా సంపాదించుకున్నారు.
అబ్బురపరిచే నటనతో సౌత్ ఇండస్ట్రీలో ఈ చిన్నది టాప్ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది. కాగా తొందరలోనే నాగచైతన్య జతగా ‘లవ్ స్టోరీ’సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి తెరముందుకు రాబోతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ను తాజాగా విడుదల చేసింది ఈ చిత్ర యూనిట్. ఈ టీజర్ లో సాయి పల్లవే హైలైట్ గా నిలబడింది. ఈ టీజర్ లో ఈ అమ్మడు ఎక్స్ ప్రెషన్స్, డ్యాన్స్, అందరినీ ఆకట్టుకునే ఆమె మాటలు, నటనతో టీజర్ కు క్రేజ్  తెచ్చింది. అందులో ముఖ్యంగా ఈ అమ్మడు చెప్పే డైలాగ్‘నన్ను వదిలేస్తున్నావా’అనే డైలాగ్ కు అందరూ ఫిదా అయ్యారు. దాంతో పాటుగా వర్షంలో సాయి పల్లవి జంపింగ్ చేసే షాట్ అయితే అందిరిచేత అదరహో అనిపిస్తోంది.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సాయి పల్లవి డ్యాన్స్ ను చూసిన ఆమె అభిమానులు ఫిదా అయ్యారు. ఏమి చేస్తివి ఏమి చేస్తివి సాయి పల్లవి.. ఇలాంటి జంపింగ్స్ నీకే సాధ్యం అంటూ నెటిజన్లు ఆమెపై కామెంట్లు చేస్తున్నారు. కాగా ఫిదా సినిమాలో ఓ పాటకు కూడా సాయి పల్లవి ఇలాంటి జంపింగే చేసింది. ఈ హీరోయిన్ ఉన్న సినిమాల్లో ఇలాంటి డాన్స్ చూడటం పక్కా.. అనిపిస్తుంది. సాయి పల్లవి నటన, ఎక్స్ ప్రెషన్స్, డ్యాన్స్ తో అందరినీ కట్టిపడేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ట్రైలర్ లో సాయి పల్లవి నటన, డ్యాన్స్ ఈ సినిమాలపై ప్రేక్షకులకు భారీ  అంచనాలనే పెంచింది సాయి పల్లవి. ఖచ్చింతంగా లవ్ స్టోరీ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టడం పక్కా అంటూ ఆమె అభిమానులు నమ్ముతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: