2020 వ సంవత్సరం అందరినీ ఇబ్బందులలో పడేసింది..ఏడాది మొదట్లోనే కరోనా మహమ్మారి ప్రజలను భయంతో వణికించడమే కాకుండా ఇప్పటికీ కూడా నిద్రలేకుండా చేస్తుంది. ఈ ప్రాణాంతకరమైన వ్యాధి ఇప్పుడు కొంతవరకు తగ్గింది.దీంతో ప్రజలు యధావిధిగా వారి పనులను కొనసాగిస్తున్నారు. కరోనా   పై ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను పాటిస్తూ వారి పనులను కొనసాగిస్తున్నారు. అన్నీ రంగాలు మళ్లీ మొదలైన కూడా సినీ రంగం మాత్రం చాలా రోజులు షూటింగ్ లకు దూరంగా ఉంది. దీంతో సినిమాల విడుదల కూడా ఆగిపోయింది.



ఇప్పుడు థియేటర్లు తెరుచుకోవడం తో సినిమాల సందడి మొదలైంది. విడుదలకు సిద్ధమైన సినిమాలు అన్నీ ఇప్పుడు విడుదల కాబోతున్నాయి. ప్రతి ఏడాది సంక్రాంతికి కొత్త సినిమాలు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.. ఈ ఏడాది కూడా కొత్త సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. ఈ మేరకు మూడు భారీ సినిమాలు విడుదల కానున్నాయి.అందులో క్రాక్ జనవరి 9న వచ్చి కిరాక్ పుట్టిస్తున్నది. కలెక్షన్స్ వస్తాయా రావా.. కరోనా భయంతో ఆడియన్స్ థియేటర్ వరకు వస్తారా రారా అనే అనుమానాలను తెరదించేస్తూ క్రాక్ వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఈ చిత్రం ఇచ్చిన ఉత్సాహంతో మాస్టర్ జనవరి 13న.. రెడ్, అల్లుడు అదుర్స్ జనవరి 14న విడుదల అవుతున్నాయి. ఈ జోరు సంక్రాంతితోనే ఆగిపోవడం లేదు.


జనవరి చివరి వారం నుంచి వేసవి కాలం వచ్చే వరకు వరుస సినిమాలు విడుదల కానున్నాయి. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం..


బంగారు బుల్లోడు: అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా జనవరి 23న విడుదల కానుంది.

30 రోజుల్లో ప్రేమించడం ఎలా: బుల్లి తెర యాంకర్ ప్రదీప్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ఇది.. జనవరి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది..

జాంబి రెడ్డి: కల్కి సినిమాల తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన సినిమా జాంబి రెడ్డి. కరోనా వైరస్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 5న థియేటర్స్‌లోకి రానుంది.


ఏ1 ఎక్స్‌ప్రెస్:  సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ఏ1 ఎక్స్‌ప్రెస్. హాకీ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 12న రిలీజ్ కానుంది.


ఉప్పెన: మెగాహీరో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న ఉప్పెన ఫిబ్రవరి చివరి వారంలో ఆడియన్స్ ముందుకు రానుంది.

రంగ్ దే: గతేడాది భీష్మతో హిట్ కొట్టిన హీరో నితిన్.. ఈ ఏడాది మార్చ్ 26న రంగ్ దే అంటూ వచ్చేస్తున్నాడు. వెంకీ అట్లూరీ దీనికి దర్శకుడు.

టక్ జగదీష్: నాని హీరోగా శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ టక్ జగదీష్. ఈ సినిమా ఏప్రిల్ 12న విడుదల కానుంది..

ఇంకా పెద్ద సినిమాలు విడుదల తేదీని ఖరారు చేయలేదు..

మరింత సమాచారం తెలుసుకోండి: