అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ప్రస్తుతం హిందువులందరూ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు అనే విషయం తెలిసిందే. దశాబ్దాల పాటు పోరాటం చేసి సుప్రీం కోర్టులో ఇక రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు రావడం తో విజయం సాధించారు కోట్ల మంది హిందువులు. ఈ క్రమం లోనే శరవేగంగా రామ మందిర నిర్మాణం చేపట్టేందుకు అటు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ట్రస్ట్ కూడా ఏర్పాటు చేసింది. అయితే 1,100 కోట్ల తో  రామ మందిర నిర్మాణం చేపట్టేందుకు అటు అయోధ్య రామ మందిర ట్రస్టు నిర్ణయించింది అన్న విషయం తెలిసిందే.



 ఇక మూడేళ్ల సమయం లో శరవేగంగా రామ మందిర నిర్మాణం పూర్తి చేసి హిందువుల కల  నెరవేర్చేందుకు రామ మందిర్ ట్రస్ట్ శరవేగంగా కసరత్తులు చేస్తుంది.  ఇకపోతే ప్రస్తుతం రామ మందిర నిర్మాణానికి దేశ వ్యాప్తంగా వివరాలు వెల్లువెత్తుతున్నాయి అన్న విషయం తెలిసిందే. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ.. అధికారుల నుంచి నాయకుల వరకు ప్రతి ఒక్కరు కూడా భారీగా రామ మందిర నిర్మాణం కోసం విరాళాలు ప్రకటిస్తున్నారు. అంతేకాకుండా కుల మత భేదం లేకుండా ఎంతో సామరస్యంగా హిందువులే కాదు ముస్లింలు కూడా రామ మందిర నిర్మాణం కోసం విరాళాలు ప్రకటిస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు రామమందిర నిర్మాణం కోసం విరాళం ప్రకటించగా.. ఇటీవలే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రణీత రామమందిర నిర్మాణం కోసం విరాళం ప్రకటించింది. అయోధ్య రామ మందిరానికి లక్షల విరాళం అందిస్తున్నట్లు ఇటీవలే హీరోయిన్ ప్రణీత ప్రకటించింది. ఈ మొత్తాన్ని ట్రస్ట్ ఏర్పాటు చేసిన రామమందిరం నిధి కి  పంపింది ప్రణీత. ప్రజలందరూ ముందుకు వచ్చి రామమందిర నిర్మాణం కోసం విరాళాలు అందించాలి అంటూ ఈ సందర్భంగా కోరింది హీరోయిన్ ప్రణీత.

మరింత సమాచారం తెలుసుకోండి: