ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..వరుస ప్లాపులతో సతమతమవుతున్న  మాస్ మహారాజా రవితేజ మొత్తానికి క్రాక్ సినిమాతో మంచి హిట్ అందుకొని తన మునుపటి వైభవాన్ని చూపించాడు. కమర్షియల్ మాస్ డైరెక్టర్ గా గోపిచంద్ మలినేని కూడా మరోసారి తన సత్తాను నిరూపించుకున్నాడు. డాన్ శీను, బలుపు వంటి సినిమాల తరువాత వీరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఇక సినిమా వసూళ్లు మొదట రోజే భారీ స్థాయిలో వచ్చాయి. అసలైతే మొదటిరోజే ఎదురైన సమస్యల కారణంగా సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా రాదా అని అనుకున్నారు అందరు.కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల ఎదురైన విడుదల సమస్యలను చాలా తొందరగా సర్దుమణిగేలా చేసుకొని సాయంత్రానికి సినిమాను విడుదల చెయ్యటం జరిగింది.

అయితే సినిమా హిట్ అవ్వడంతో ఆ బాధలను మర్చిపోయారు. ఇక సినిమా మూడవ రోజు ఈ సినిమా 2 కోట్లకు పైగా అందుకుంటుందని అంచనా వేశారు. ఇక అనుకున్నట్లుగానే సినిమా రూ.2.86కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి  నిర్మాతలను సంతోషపరిచింది.ఇక మాస్టర్ సినిమా నెగటివ్ టాక్ ని మూట గట్టుకుంది  కాబట్టి క్రాక్ కు జనాలు క్యూ కడుతున్నారు.

ఇక సినిమా ఇలానే మరో మూడు రోజులు కలెక్షన్స్ అందుకోగలిగితే లాభాల బాట పడుతుంది..ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: