సినీ ఇండస్ట్రీలోకి చాలామంది కొత్త హీరోలు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూనే ఉంటారు. కేవలం వారు హీరోగా నటిస్తే సరిపోదు. వారిలో ఉన్న నటనను ప్రేక్షకుల దగ్గర మెప్పించాల్సి ఉంటుంది. అలా వారిలోని ప్రతిభను బయటకు తీసుకురావాలంటే అందుకు సరైన మార్గం దర్శకులు. ఒక దర్శకుడు ఒక హీరో ని మంచి పొజిషన్లో నిలబెట్టాలి అంటే సినిమాలోని కంటెంట్, టేకింగ్,యాక్షన్ సీన్స్,హీరో ని ప్రొజెక్ట్ చేసే విధానం ఇలా అన్నీ మంచిగా ఉంటే కంపల్సరిగా ఒక హీరో స్టార్ హీరో అయ్యే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం ఒక దర్శకుడు కూడా ఏడు మంది హీరోలకు వారి ప్రతిభను ప్రేక్షకుల ముందు నిలబెట్టి,వారిని స్టార్ హీరోస్ లాగా రూపుదిద్దాడు. ఇప్పుడు ఆ దర్శకుడు ఎవరో? ఆ స్టార్ హీరోలు ఎవరో? ఇప్పుడు చూద్దాం.
నాని - ఈగ (2012) :
నాని "ఈగ "సినిమా వరకు లేని బిగ్గెస్ట్ హిట్టును దర్శక దిగ్గజం రాజమౌళి చూపించాడు. తన కెరీర్లో సాధించిన మొట్టమొదటి సినిమా ఈగ. ఈగ సినిమా తర్వాత నాని కెరియర్ ఓ మలుపు తీసుకుంది. అప్పటివరకు చిన్నా చితకా సినిమాలు తీస్తూ యావరేజ్ గా నిలుస్తున్న నాని ఈగ సినిమాతో స్టార్స్ లిస్ట్ లోకి వెళ్ళిపోయాడు.
నితిన్ - సై (2004):
హీరో నితిన్ యావరేజ్ సినిమాలు తీస్తూ ప్రేక్షకులలో ఒక మోస్తరు గుర్తింపును మాత్రమే నిలబెట్టుకోగలిగాడు. కానీ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మాత్రం నితిన్ ని స్టార్ హీరోగా మార్చింది. ఇక ఈ సినిమా నితిన్ జీవితంలో ఒక పెద్ద మలుపు ని తీసుకువచ్చిందని చెప్పవచ్చు.
ఎన్టీఆర్ - సింహాద్రి ( 2003):
ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుండి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి సినిమాలో తన మాస్ క్యారెక్టర్ని చూపించుకోగలిగాడు. ఇలా ఒక మాస్ హీరోగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలిగాడు ఎన్టీఆర్.
ప్రభాస్ - చత్రపతి ( 2005):
అప్పటివరకు ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న ప్రభాస్ చత్రపతి సినిమా ద్వారా పెద్ద స్టార్ హీరోగా మారిపోయాడు.
రామ్ చరణ్ - మగధీర( 2009):
ఇండస్ట్రీలో ఇంకా అప్పుడప్పుడే కొద్ది కొద్ది గా ఎదుగుతున్న రామ్ చరణ్ మగధీర సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను సాధించాడు. హీరో నుంచి స్టార్ హీరోలతో కి ఓవర్నైట్ లోనే ఎదిగాడు.
రవితేజ - విక్రమార్కుడు ( 2006)
రవితేజ కెరీర్లో ది బెస్ట్ మూవీ నుంచి బాక్సాఫీస్ దగ్గర భారీ విజయకేతనం ఎగురవేశాడు.
సునీల్ - మర్యాద రామన్న( 2010)
ఒక కమెడియన్ కి కూడా కొత్త యాంగిల్ ను తీసుకొచ్చి, ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో అదిరిపోయే సినిమా తీసి సినిమాకు హీరోల కంటే కథ చాలా ముఖ్యమని నిరూపించి,సునీల్ కు ఎదురు లేని బ్లాక్ బాస్టర్ హిట్ ను సంపాదించి పెట్టాడు.