పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గత మూడేళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక మూడేళ్ల తర్వాత ఇప్పుడు వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా టీజర్ సంక్రాంతి సందర్బంగా విడుదలై ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అయి తీరుతుందని పవన్ కల్యాణ్ అభిమానులు దీమాగా ఉన్నారు. ఇక ఈ సినిమా తర్వాత వరుస సినిమాలను పవన్ కల్యాణ్ లైన్ లో పెట్టేశారు. క్రిష్ జాగర్లమూడితో ఓ సినిమా చేస్తుండగా.. మళయాలం రీమేక్ చిత్రం అయ్యప్పనుమ్ కోషియమ్‌లో ఆయన నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయనతో పాటు రానా దగ్గుపాటి కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఈ విషయం ఇలా ఉంటే.. ఈ సినిమాలో పవన్ కల్యాణ్‌కు జోడీగా ఏ హారోయిన్ నటించనుందో ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. ఈ సినిమాలో సాయి పల్లవిని తీసుకోవాలని చిత్ర దర్శక నిర్మాతలు అనుకుంటున్నారట. ఇప్పటికే సాయి పల్లవిని సంప్రదించారని, అయితే ఆమెకు డేట్స్ అడ్జెస్ట్ అవ్వడం లేదని తెలుస్తోంది. వరుస సినిమాలు చేస్తుండటం కారణంగా పవన్ కల్యాణ్ చిత్రానికి ఆమె తన డేట్స్‌ను ఇవ్వడానికి సమస్యగా ఉందట. అయితే ఆమె పవన్ కల్యాణ్ పక్కన నటించే అవకాశాన్ని వదులుకోకూడదని భావిస్తోందట.

అందుకే ఈ చిత్రానికి ఏదో ఒక విధంగా డేట్స్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్. మరి చిత్ర దర్శక నిర్మాతు హీరోయిన్ అవకాశాన్ని ఎవరికి ఇస్తారో వేచిచూడాలి. ఇక ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలను మాటల మంత్రికుడు త్రివిక్రమ్ అందిస్తున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ సినిమాలో భాగం కావడంతో.. ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. గతంలో త్రివిక్రమ్ పవన్ కల్యాణ్ నటించిన తీన్ మార్ చిత్రానికి కూడా మాటలు అందించిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: