అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఒక మాజీ నక్సలైట్ గా నటిస్తుండగా రామ్ చరణ్ ఒక విద్యార్థి నాయకుడిగా నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ అతి త్వరలో ప్రారంభం కాబోతున్న ట్లు తెలుస్తోంది. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ మూవీ ద్వారా మెగాస్టార్ సినిమాకి పనిచేస్తున్న మణిశర్మ, మ్యూజిక్ విషయమై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా సినిమాలోని ఐదు సాంగ్స్ ఎంతో అదిరిపోతాయని అలానే మూవీ యొక్క బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా గ్రౌండ్ లెవెల్ లో ఉండేలా ప్రత్యేకంగా జాగ్రత్త తీసుకుంటున్నట్టు సమాచారం. అన్నిటికంటే ముఖ్యంగా సినిమాలో సెకండాఫ్ లో వచ్చే ఒక మాస్ సాంగ్ మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ ని కూడా అలరించడం ఖాయమని టాక్. ఇక ఈ సాంగ్ లో మెగాస్టార్ తో పాటు మెగా పవర్ స్టార్ కూడా స్టెప్పులేయనున్నారని అంటున్నారు. రేపు మూవీ రిలీజ్ తర్వాత థియేటర్స్ ఈ సాంగ్ కి విజిల్స్ తో మొతమ్రోగిపోవడం పోవటం ఖాయం అని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమైతే ఇది నిజంగా మెగా ఫ్యాన్స్ కి పెద్ద పండుగ వార్త అని చెప్పక తప్పదు......!!