ఇక ఇప్పుడు తాజాగా విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో కొత్త చిత్రం వస్తోంది. కొద్ది నిమిషాల క్రితమే ఈ సినిమా పోస్టర్, టైటిల్ విడుదలైంది. ఈ సినిమాకు ‘లైగర్’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ పెట్టింది. లైగర్ అంటే.. లయన్ + టైగర్ అని అర్థం. అంతే కాకుండా సాలా క్రాస్ బ్రీడ్ అనే క్యాప్షన్‌ను కూడా తగిలించారు. దీంతో నెటిజన్లు విపరీతమైన కామెంట్లు చేయడం మొదలుపెడుతున్నారు. విజయ్ దేవరకొండతో పాటు కరణ్ జోహార్‌ను కూడా ఆడుకుంటున్నారు. ఈ చిత్ర ప్రొడ్యూసర్లలో కరణ్ జోహార్ కూడా ఒకరు. ఆయన గే కావడం.. చిత్రానికి క్రాస్ బ్రీడ్ అనే క్యాప్షన్ పెట్టడంతో ఆయనపై కూడా ట్రోల్స్ చేస్తున్నారు.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించిన నాటి నుంచి కరణ్ జోహార్‌పై ఏ విధమైన కామెంట్లు వస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. ఈ కారణంగానే కరణ్ జోహార్‌పై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. మరో పక్క విజయ్ దేవరకొండ లైగర్ అనే చిత్ర టైటిల్ ఏ విధంగానూ ఆకట్టుకోవడం లేదంటూ చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనప్పటికి లైగర్ చిత్రం విజయ్ దేవరకొండకు, పూరి జగన్నాథ్‌కు మంచి హిట్‌ను ఇవ్వాలని కోరుకుందాం.