ఇక ఢీ కంటెస్టెంట్ లు, మాస్టర్లు సుమతో ఆడేందుదుకు షో కి వచ్చారు. తేజస్విని, సుదర్శన్, ఐశ్వర్య, మనోజ్, చైతన్య వంటివారు రాగా వారందరినీ సుమ ఒక ఆట ఆడుకుంది. ఐశ్వర్య కు అయితే సుమ పరువు తీసి మరీ పంపించింది. ఇండస్ట్రీ కి ఎందుకు వచ్చావు అని అడిగినప్పుడు హీరోయిన్ అవుదామని వచ్చాను అని ఐశ్వర్య చెప్పింది. ఎందుకు అలా అనిపించింది అంటే అందంగా ఉన్నాను అని చెప్పింది. అందంగా ఉన్నావ్ అని ఎవరు చెప్పారు అని కౌంటర్ వేసింది.
అలాగే మరొక రౌండ్ లో భాగంగా మాస్టర్ లను ఒకవైపు కంటెస్టెంట్ లను మరొకవైపు కూర్చోబెట్టిన సుమ అందులో భాగంగా ఢీ విషయాల గురించి గురించి ప్రశ్నించింది. షో లో కంటెస్టెంట్లకు, మాస్టర్ కు మధ్య అఫైర్స్ ఉన్నాయంటూ సుమా వారిని ప్రశ్నించగా ఒక్కసారిగా బిత్తరపోయిన మాస్టర్లు కవర్ చేసుకునేందుకు ట్రై చేశారు.
అయితే మా దగ్గర ఉన్నది బాయ్స్ కంటెస్టెంట్ లు అని మాస్టర్లు చెప్పినప్పుడు బయట నుండి వారితోనే అఫైర్స్ పెట్టుకుంటారా అని సెటైర్లు వేశారు. ఇక రాకేష్ మాస్టర్ ఢీ గురించి చెప్పిన టాపిక్ కూడా వైరల్ అయ్యాయి. రాకేష్ మాస్టర్… షాట్ రెడీ అయినప్పటికీ ఢీ కంటెస్టెంట్ లు రారని…. ఎక్కడెక్కడో పొదల్లో ఉంటారు ఇంకా చాలా దారుణాలు జరుగుతుంటాయని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఇలా ఇప్పుడు సుమ అడిగిన విషయం బాగా వైరల్ అవుతుంది.