ఇక మన మెగాస్టార్ చిరంజీవి మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ను తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్నాడు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన కాస్టింగ్ ప్రాసెస్ మొదలైంది. నయనతార, సత్యదేవ్ లాంటి వాళ్లను తీసుకున్నారు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ను ఎంపిక చేసుకున్నారు. ఈ విషయాన్ని తమన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ప్రతీ కంపోజర్ కి ఇదొక పెద్ద కల అని.. మెగాస్టార్ చిరంజీవిపై ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు సమయం వచ్చిందని తమన్ సోషల్ మీడియా ద్వారా మెగాస్టార్ పై తన ప్రేమను అభిమానులతో పంచుకున్నాడు.
ప్రస్తుతం తమన్ చేస్తున్న సినిమాలన్ని కూడా భారీ బడ్జెట్ సినిమాలే కావడం విశేషం.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్,సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’,యంగ్ టైగర్ ఎన్టీఆర్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పాటలు అందిస్తున్నాడు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమా ఛాన్స్ కూడా ఈ యంగ్ అండ్ డైనమిక్ మ్యూజిక్ డైరెక్టర్ అందుకున్నాడు. ఇలాంటి ఛాన్స్ తనకు వచ్చినందుకు తమన్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...