మీడియం రేంజ్ హీరోస్‌లో నానికి యూనిక్ ఇమేజ్ ఉంది. యూత్, ఫ్యామిలీస్ ఇద్దరికీ దగ్గరయ్యాడు. అయితే 'జెర్సీ' తర్వాత నాని కొంచెం స్లో అయ్యాడు. 'గ్యాంగ్ లీడర్, వి' సినిమాలు అంచనాలు అందుకోలేకపోయాయి. దీంతో ఇప్పుడు 'టక్ జగదీష్'తో బాక్సాఫీస్‌ని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నాడు నాని.
శర్వానంద్‌కి ఆడియన్స్‌లో సెపరేట్ ఇమేజ్ ఉంది. యూనిక్ స్టోరీస్‌తో సర్‌ప్రైజ్ చేస్తాడని అంతా ఫీలవుతుంటారు. అయితే రెండేళ్లుగా శర్వా సినిమాలు ప్రేక్షకుల అంచనాలని అందుకోలేకపోతున్నాయి. 'పడి పడి లేచే మనసు, రణరంగం, జాను' సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తడబడ్డాయి. దీంతో ఇప్పుడు 'శ్రీకారం' సినిమాతో మళ్లీ ట్రాక్ ఎక్కాలనుకుంటున్నాడు శర్వా.
విజయ్ దేవరకొండ ఫస్ట్ రెండు మూడు సినిమాలతోనే సూపర్ స్టార్డమ్ సంపాదించాడు. కానీ వరుస ఫ్లాపులతో ఈ మార్కెట్ రేంజ్ కొంచెం తగ్గిపోయింది. 'డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలు విజయ్‌ని దెబ్బకొట్టాయి. దీంతో పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో చేస్తోన్న 'లైగర్' సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు విజయ్.
స్టార్ హీరోలకి ఒకటి రెండు ఫ్లాపులొచ్చినా మార్కెట్‌లో పెద్దగా తేడా కనిపించదు. అప్పటికే ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌తో వాళ్ల జర్నీ బాగానే సాగుతుంది. కానీ యంగ్‌స్టర్స్‌కి ఫ్లాప్ పడితే మాత్రం మార్కెట్‌లో తేడాలొచ్చేస్తాయి. రెమ్యూనరేషన్లు, బిజినెస్ అంతా పడిపోతుంది.
అఖిల్‌పై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. 'మనం'లో స్పెషల్ అప్పియరెన్స్ తర్వాతఅఖిల్‌ని సూపర్ స్టార్‌లా ఊహించుకున్నారు. అయితే సిసింద్రీ మాత్రం ఇప్పటివరకు అభిమానుల అంచనాలు అందుకోలేదు. ఇంకా స్టార్ రేసులో అడుగుపెట్టలేదు అఖిల్. ఈ టఫ్ సిట్యువేషన్ నుంచి బయటపడ్డానికి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'గా బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాడు సిసింద్రీ.
మంచు మనోజ్ కొన్నాళ్లుగా బాక్సాఫీస్ దగ్గర సందడి చెయ్యలేకపోతున్నాడు. ఆరేళ్లుగా సరైన సక్సెస్ లేదు. 'శౌర్య, ఎటాక్, గుంటూరోడు' ఫ్లాపులతో మనోజ్ కొంచెం స్లో అయ్యాడు. ఇక రాజ్ తరుణ్ కూడా ఫ్లాపుల్లోనే ఉన్నాడు. 'కిట్టూ ఉన్నాడు జాగ్రత్త' నుంచి మొదలుపెడితే ఏడు ఫ్లాపులతో మార్కెట్ కూడా కోల్పోయాడు రాజ్ తరుణ్.