మహేశ్ బాబు చెప్పిన ఈ డైలాగ్‌ని యాజ్‌టీజ్‌గా దింపేశారు విజయ్ దేవరకొండ అభిమానులు. ఈ హీరో ఎంత యూనిక్‌గా ఉండాలని ప్రయత్నం చేస్తాడో, అతని ఫ్యాన్స్ కూడా తమ అభిమానాన్ని అంతే డిఫరెంట్‌గా చూపిస్తున్నారు. విజయ్‌ని 'అర్జున్ రెడ్డి'లా ట్రీట్ చేస్తూ ఈ హీరోకి బీరాభిషేకాలు చేశారు.
విజయ్ దేవరకొండ కెరీర్‌పై 'అర్జున్ రెడ్డి' ప్రభావం ఎంతుందో, అతని అభిమానులపైనా అంతే ప్రభావం ఉంది. అందుకే 'అర్జున్‌రెడ్డి'లో ఎప్పుడూ ఆల్కాహాల్‌తో కనిపించే రౌడీని ఇదే ఆల్కాహాల్‌తో గౌరవిస్తున్నారు. విజయ్ సినిమా పోస్టర్లని ఆల్కాహాల్‌తో తడిపేస్తున్నారు. రీసెంట్‌గా రిలీజైన 'లైగర్' ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని బీర్లతో అభిషేకించారు అభిమానులు.
పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో 'లైగర్' అనే సినిమా చేస్తున్నాడు. లయన్, టైగర్‌ల క్రాస్ బ్రీడ్ 'లైగర్' అనే కాన్పెప్ట్‌తో ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశాడు పూరీ. ఈ డిఫరెంట్ థాట్‌ని అభిమానులు కూడా ఇదే లెవల్‌లో రిసీవ్ చేసుకున్నారు. విజయ్ పోస్టర్‌ని బీర్లల్లో ముంచేశారు. మరి పోస్టర్‌తోనే అభిమానుల చేతుల్లోకి బీరు బాటిల్ తీసుకొచ్చిన 'లైగర్', థియేటర్లలో ఎలాంటి రచ్చ చేస్తుందో చూడాలి.
మొత్తానికి రౌడీ హీరో విజయ్ దేవరకొం అభిమానులు తమ హీరోపై వింతగా అభిమానం చూపించారు. లైగర్ పోస్టర్ ని బీర్ లతో ముంచి మనస్ఫూర్తిగా అభిమానాన్ని చాటుకున్నారు. విజయ్ దేవరకొం బీర్ అభిషేకం వీడియోలు ఈ మధ్య నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. విజయ్ దేవరకొండని ఇప్పటికీ అర్జున్ రెడ్డిగా భావిస్తున్నారు ఆయన ఫ్యాన్స్.