మెగా ఫ్యామిలీలో అరడజను వరకు యంగ్ హీరోస్ ఉన్నారు. కానీ వాళ్లందరికంటే చిరంజీవి ఫుల్ స్పీడ్‌గా సినిమాలు చేస్తున్నాడు. రామ్ చరణ్ 'ఆర్ ఆర్ ఆర్' తర్వాత ఏం చేద్దాం అని ఆలోచిస్తోంటే, మెగాస్టార్ మాత్రం మూడు సినిమాలు లైన్లో పెట్టాడు. 'ఆచార్య' కంప్లీట్‌కాకముందే 'లూసిఫర్' రీమేక్ స్టార్ట్ చేశాడు చిరంజీవి.
చిరంజీవి 'వేదళం' రీమేక్‌కి కూడా డేట్ ఫిక్స్ అయ్యిందనే టాక్ వస్తోంది. మెహర్ రమేశ్ డైరెక్షన్లో త్వరలోనే ఈ రీమేక్ స్టార్ట్ అవుతుందని చెబుతున్నారు. వీటితోపాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా పైప్ లైన్లో ఉన్నాయని, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్స్ వచ్చే అవకాశముందని చెబుతున్నారు.
పవన్ కళ్యాణ్ అయితే ఎవరూ ఊహించని రేంజ్లో సినిమాలకి సైన్ చేస్తున్నాడు. ఎప్పుడూ ఒక ప్రాజెక్ట్ తర్వాత మరొక ప్రాజెక్ట్ అన్నట్లు ఉంటే పవన్, కమ్ బ్యాక్‌లో మాత్రం గేమ్ చేంజ్ చేశాడు. బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌తో సర్ప్రైజ్ చేస్తున్నాడు. 'వకీల్‌సాబ్' సెట్స్‌లో ఉండగానే నాలుగు సినిమాలని ఓకే చేశాడు పవన్.
పవన్ కళ్యాణ్ ఇప్పటికే క్రిష్ డైరెక్షన్లో ఒక హిస్టారికల్ డ్రామా స్టార్ చేశాడు. అలాగే సాగర్.కె.చంద్రతో 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ చేస్తున్నాడు. వీటితో పాటు హరీశ్ శంకర్‌తో ఒక సినిమా, సురేందర్ రెడ్డితో ఒక సినిమాకి సైన్ చేశాడు పవన్. మొత్తంగా పవర్‌స్టార్ ఈ ఏడాది రెండు సినిమాలు రిలీజ్ చేస్తాడని తెలుస్తోంది. మొత్తానికి మెగా సోదరులు ఫుల్ స్పీడ్ గా ఉన్నారు. కుర్రకారుకు పోటీ పడుతూ సినీ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నారు. ఇదే ఇపుడు మెగా అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. వరుసబెట్టి తమ అభిమాన హీరోల సినిమాలు వస్తుంటే.. ఆనందంలో మునిగితేలుతున్నారు.