మాస్ మహారాజా రవితేజ హీరోగా రాక్ లైన్ ఎంట్రటైన్ మెంట్ ప్రే. లిమిటెడ్ పతాకం పై కె.ఎస్.రవీంద్ర (బాబి)ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ వస్తున్న చిత్రం ‘పవర్’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ మాట్లాడుతూ రవితేజ హీరోగా రవీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న పవర్ చిత్రం చాలా చాలా పవర్ ఫుల్ గా ఉంటుందన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ఫుల్ లెన్త్ మూవీగా సినిమాను రూపొందించామ్నారు. డైరెక్టర్ రవీంద్ర (బాబీ) ఈ సినిమాను చాలా అద్భుతంగా హ్యాండిల్ చేసి ఒక పవర్ ఫుల్ సినిమాగా ప్రేక్షకులకు అందించనున్నారు. ముఖ్యంగా రవితేజ పాడిన ‘నోటంకి .. నోటంకి ’ పాట చాలా హైలెట్ అని చెప్పొచ్చు అన్నారు. దర్శకుడు రవీంద్ర(బాబీ) మాట్లాడుతూ దర్శకుడిగా ఇది నా తొలి సినిమా నా తొలి చిత్రమే ఇంద పెద్ద బేనర్ లో మాస్ మహారాజ రవితేజ తో చేయడం చాలా సంతోషం అని చెప్పారు. రవితేజ చాలా యాక్టీవ్ గా ఉంటారని తనకు చాలా ఎంకరేజ్ మెంట్ ఇచ్చారని అందుకే పవర్ చిత్రాన్ని మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందించామన్నారు. తప్పకుండా ఈచిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చుతుందన్నాదీమా వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: