ఈ వారం విడుదల కాబోతున్న నాగచైతన్య ‘ఒక లైలా కోసం’ సినిమా ప్రమోషన్ లో భాగంగా నిన్న అన్నపూర్ణ స్టుడియోలో భాగ్యనగర యువత కోసం వినూత్న పోటీలు నిర్వహించి ఈ సినిమా పై యూత్ లో క్రేజ్ పెంచడానికి ప్రయత్నం చేసారు. అయితే ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించిన సాయికృప హంగామా ఈ కార్యక్రమానికి హైలెట్ గా మారింది.
ఇప్పటిదాకా హాట్ యాంకర్లుగా పేరుతెచ్చుకున్న అనసూయ, రేష్మీ లాంటి వాళ్ళను తలదన్నుతూ సాయికృప వేసిన చిందులు చూసి ఆ కార్యక్రమానికి వచ్చిన వారు ‘ఒక లైలా కోసం’ సినిమా కార్యక్రమానికి వచ్చామా లేదంటే సాయికృప లైవ్ హాట్ షూట్ ను చూడడానికి వచ్చామా అని కామెంట్లు చేసుకున్నారు.
చిట్టిపొట్టి డ్రస్సులతో సాయికృప రేచ్చిపోతు ఉంటే మరో వైపు కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించిన అలీ వేసిన మోతాదు మించిన అడల్ట్ జోకులు వినడానికి కూడా ఇబ్బంది కరంగా మారాయి. ఈ హాట్ యాంకర్ స్టేజ్ దిగి వచ్చి వేదిక కింద ఉన్న యూత్ తో కలిసిపోతు మరీ రెచ్చిపోయి స్టెప్పులు వేసింది.
ఈ కార్యక్రమం మధ్యలో అలీ సాయికృప వేసుకున్న పొట్టి నిక్కర్ పై వేసిన బూతు పంచ్ లకు యూత్ మైమరచిపోయి నవ్వుతూ ఉంటే ఒక సినిమా ప్రమోషన్ కోసం ఇంత దిగాజారాలా అని కొందరు చేసిన కామెంట్లు ఈ ఈవెంట్ మధ్యలో వినిపించాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: