వరస పరాజయాల తరువాత ‘లౌక్యం’ ఇచ్చిన సక్సస్ తో మంచి జోష్ మీద ఉన్నాడు గోపీచంద్. అయితే ఈ సినిమా విజయంలో రచయిత శ్రీధర్ శ్రీపాన పాత్ర ఎంత ఉందో, సిప్పీ పాత్రలో నటించి ప్రేక్షకులను తెగ నవ్వించిన బ్రహ్మీకి కూడా ఈ సినిమా విజయంలో షేర్ ఉంది అనే విషయం ఎవరు కాదనలేని సత్యం.  ఈ సినిమా ఘన విజయం తరువాత బ్రహ్మానందం దృష్టి ఈ సినిమా రచయిత శ్రీధర్ శ్రీపాన పై పడి తన కొడుకు గౌతమ్ కోసం ఒక మంచి కథను ఇమ్మని అడిగాడట బ్రహ్మి. రచయిత శ్రీధర్ కూడా ఇదే పని మొదలు పెడదాము అని అనుకుంటూ ఉండగా గోపీ చంద్ తాను నటించబోయే కొత్త సినిమాకు కూడా ఒక వెరైటీ కధను అర్జంట్ గా తయారు చేయమని రచయిత శ్రీధర్ ను కోరాడట.  దీనితో ఈ రచయిత యంగ్ హీరో గౌతమ్ సినిమాకన్నా తనకు కలిసి వచ్చిన గోపీచంద్ బెటర్ అని ఆలోచించి బ్రహ్మి కొడుకు కోసం రాద్దాము అనుకున్న కథ ఆపి గోపీచంద్ వైపు పరుగులు తీసాడు అని టాక్.  ఈ న్యూస్ ను ఆలస్యంగా తెలుసుకున్న బ్రహ్మీ తాను నటించిన సిప్పీ పాత్ర ద్వారా గోపీచంద్ కు హిట్ ఇచ్చినా తనకు ఎదురు దెబ్బ కొట్టి గోపీచంద్ హ్యాండ్ ఇచ్చాడు అని తన సన్నిహితుల దగ్గర బాధ పడుతున్నట్లు టాక్.. 

మరింత సమాచారం తెలుసుకోండి: