రేణుదేశాయ్ తన పుట్టిన రోజునాడు ఇచ్చిన ఇంటర్వ్యూలోని విషయాలపై మరో క్లారిటీ ఇస్తూ పెట్టిన ట్విటర్ వెనుక చాల పెద్ద కధే నడిచింది అనే వార్తలు వస్తున్నాయి. ‘నేను నా సైడ్ క్లారిఫై చేసాను. నేను ఒక పదం కూడా కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఒక్క మాట కూడా ఆయన్ను బ్లేమ్ చేసేలా లేదు. మా పెళ్లి, విడాకుల విషయం పక్కన పెడితే ఒక మంచి మనిషిగా ఆయన్ను గౌరవిస్తాను. కానీ నాకు కూడా వ్యక్తిగతమైన బాధ ఉంది పవన్ చెడ్డ మనిషి కాదు, నా ఇంటర్వ్యూ విషయమై ఎవరూ నెగిటివ్ గా ఆలోచించ వద్దు. పవన్ కళ్యాణ్ ను బాధ పెట్టడానికో లేక బ్లెమ్ చేయడానికో నేను ఆ ఇంటర్వ్యూ ఇవ్వలేదు’ అంటూ రేణు తన ట్విటర్ లో పెట్టిన వివరణ వెనుక చాల పెద్ద కథ నడిచింది అని టాక్.
రేణుదేశాయ్ ఇచ్చిన ఇంటర్వ్యూను చాల ప్రముఖ ఛానల్స్ కూడా ప్రచారం చేసాయి. అయితే ఈ ఇంటర్వ్యూ పవన్ వీరాభిమానులను తీవ్రంగా బాధపడేలా చేసిందని టాక్. ఎప్పుడో జరిగిపోయిన డైవర్స్ గురించి, ఆ విడాకులలో భరణంగా రూపాయి కూడా తీసుకోలేదు అని అనడం గురించి, అకిరా బాధ పడుతున్నాడు అని చెప్పడం వెనుక రేణుదేశాయ్ ఉద్దేశ్యం ఏమిటి అని ఆమెను ప్రశ్నిస్తూ రేణుకు గత రెండు రోజులుగా చాలామంది మెసేజ్ లతో టార్గెట్ చేస్తున్నారని టాక్.
అంతేకాదు పవన్ కళ్యాణ్ పై నెగిటివ్ గా ప్రచారం చేసే విధంగా రేణుదేశాయ్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఉందని పవన్ వీరాభిమానులు తీవ్ర మధన పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కామెంట్స్ తన దృష్టికి రావడంతో జాగ్రత్తపడిన రేణు ఈ క్లారిటీ ఇచ్చింది అని అంటున్నారు.
మరి ఈ విషయం ఇక్కడితో ముగిసి పోతుందా ? లేక మరిన్ని మలుపులు తిరుగుతుందా అనే విషయం రానున్న రోజులలో తేలుతుంది..
మరింత సమాచారం తెలుసుకోండి: