చిరంజీవి కోసం ఎదురు చూపులు చూస్తున్న ఒకనాటి ప్రముఖ దర్శకుడికి సంబంధించిన ఒక ఆ శక్తికరమైన న్యూస్ ఫిలింనగర్ లో హడావిడి చేస్తోంది. ఇక వివరాలలోకి వెళితే చిరంజీవి మెగా హీరో కాకముందు చిరంజీవిని టాప్ హీరోగా మార్చిన దర్శకుల లిస్టులో ఒకనాటి ప్రముఖ దర్శకుడు విజయ్ బాపినీడు ఒకరు. 1980 – 1990 ప్రాంతాలలో విజయబాపినీడు చిరంజీవి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్ లో ఆరోజులలో వచ్చిన ‘మగ మహారాజు’, ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలు టాలీవుడ్ చరిత్రలో సంచలనాలు సృస్టించాయి. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘బిగ్ బాస్’ తరువాత మళ్ళీ వీరిద్దరూ కలిసి సినిమాలకు పనిచేయలేదు. ఆరోజులలో ఎంతో స్నేహంగా ఉండే వీరిద్దరి మధ్యా ఆ తరువాత కాలంలో కొన్ని భేదాభిప్రాయాలు వచ్చాయి అనే వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి. అయితే చిరంజీవికి ఎన్నో హిట్స్ ఇచ్చిన విజయబాపినీడు తిరిగి దర్శకుడిగా తన సత్తాను చాటడానికి ఒక వెరైటీ కథను తయారు చేసుకుని చిరంజీవి ఇంటి చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే క్యాలెండర్ లో సంవత్సరాలు గడిచి పోతున్నా చిరంజీవి 150వ సినిమా విషయమే తేలని నేపధ్యంలో ఇక విజయబాపినీడు కోరిక తీరడానికి ఇంకెంత కాలం పడుతుందో విజయబాపినీడుకే తెలియాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: