ఎన్నో భారీ అంచనాలతో విడుదలైన ‘ముకుంద’ మెగా అభిమానులను నిరాస పరిచినా ఆ సినిమాకు మొదటి రోజు మూడున్నర కోట్లు కలెక్షన్స్ వచ్చాయి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నిన్న విడుదలైన నితిన్ ‘చిన్న దానా నీకోసం’ సినిమాకు కూడా నెగిటివ్ టాక్ రావడంతో ఈ వీకెండ్ ‘ముకుంద’ కలెక్షన్స్ విషయంలో ఏమైనా పుంజుకుంటుoదా అనే ఆశలో ఈ సినిమా నిర్మాతలు ఉన్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను భారీ మొత్తాలకు కొనుక్కున్న బయ్యర్లు ఈ సినిమాకు వచ్చిన వీక్ టాక్ ను చూసి బెంబేలు పడిపోతున్నట్లు టాక్.
‘ముకుంద’ సినిమాను చూసిన వారంతా ఈ సినిమా పరాజయానికి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఎంచుకున్న రాంగ్ స్క్రిప్ట్ అవడమే కాకుండా ఈ సినిమా సెకండ్ ఆఫ్ లో కథకు సంబంధించి సన్నివేశాల మధ్య లింక్స్ మిస్ అయ్యాయి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే జరిగిన ఈ పొరపాటు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలది కాదు అనే వార్తలు వినపడుతున్నాయి.
ఈ సినిమా నిడివి సుమారు 3 గంటలు రావడంతో బయపడి పోయిన మెగా ఫ్యామిలీ, నిర్మాత మధు ఎవరికి తోచినట్లుగ వారు 40 నిముషాల ఎడిటింగ్ దర్శకుడి ప్రేమేయం లేకుండా చేసుకుంటూ వెళ్లిపోవడంతో ‘ముకుంద’ సెకండ్ ఆఫ్ లోని సన్నివేశాల లింక్స్ ఎవరికీ అర్ధం కాకుండా పోయాయని ఫిలింనగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఏది ఏమైనా మంచి సినిమాల దర్శకుడిగా పేరు గాంచిన శ్రీకాంత్ అడ్డాలకు తొలి సినిమా పై ఎన్నో అసలు పెట్టుకున్న వరుణ్ తేజ్ కు ‘ముకుంద’ వారి ఆశలను తీర్చలేకపోయింది..
మరింత సమాచారం తెలుసుకోండి: