మాస్ దాస్ ఫలక్ నుమా దాస్ విశ్వక్ సేన్ గురించి అందరికి తెలిసిందే. ఈనగరానికి ఏమైంది సినిమాతో పరిచయమైన ఈ హీరో ఆ తర్వాత హీరో కం డైరక్టర్ గా ఫలక్ నుమా దాస్ సినిమా చేశాడు. ఆ తర్వాత నాని నిర్మాతగా చేసిన హిట్ సినిమాతో హిట్ అందుకున్నాడు విశ్వక్ సేన్. అయితే విశ్వక్ సేన్ అసలు పేరు ఏంటి అతను ఎప్పటి నుండి సినిమా ప్రయత్నాలు చేస్తున్నాడు అన్నది రీసెంట్ గా ప్రదీప్ యాంకర్ గా చేస్తున్న కొంచం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 4లో జరిపిన ఇంటర్వ్యూలో తెలిసింది.

విశ్వక్ సేన్ అసలు పేరు దినేష్.. అదే పేరుతో సినిమా అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగాడట. అయితే రెండు మూడేళ్లు తిరిగినా అవకాశాలు రాకపోవడంతో న్యూమరాలజీ ద్వారా పేరు మార్పించుకున్నానని చెప్పాడు విశ్వక్ సేన్ అలియాస్ దినేష్. అంతేకాదు తను చేసిన చాలా సినిమాలు మధ్యలో ఆగిపోయాయని.. ఏడు ఎనిమిది ఏళ్లుగా తను సినిమా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నానని అన్నారు విశ్వక్ సేన్. టాలీవుడ్ యంగ్ హీరోల్లో విశ్వక్ సేన్ తన సత్తా చాటుతున్నాడు. రెండు మూడు సినిమాలకే విశ్వక్ సేన్ కు మంచి మాస్ ఇమేజ్ వచ్చింది.

ఇక మాస్ తో పాటుగా విశ్వక్ సేన్ క్లాస్ ఆడియెన్స్ కోసం కూడా ప్రయత్నిస్తున్నాడు. అందుకే తన నెక్స్ట్ సినిమా లవ్ స్టోరీ చేస్తున్నట్టు తెలుస్తుంది. విశ్వక్ సేన్ కూడా అలా వచ్చి ఇలా హీరో అవలేదు.. హీరోగా కాకపోయినా డైరక్టర్ గా అయినా ఇండస్ట్రీలో ఉండాలని అనుకున్నాడట. మొత్తానికి విశ్వక్ సేన్ తన టాలెంట్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. త్వరలో తన సినిమాల ఎనౌన్స్ మెంట్ ఉంటుందని.. ఈసారి కొత్తగా ప్రయత్నిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు విశ్వక్ సేన్.               

మరింత సమాచారం తెలుసుకోండి: