ఎక్కడ వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారా అన్నంత బిల్డప్ క్రియేట్ అయ్యింది.. కానీ బయటకి వచ్చాక సీన్ వేరే గా ఉంది. రాహుల్ పునర్నవి ని కాకుండా మరో బిగ్ బాస్ పార్టిసిపెంట్ అషు రెడ్డి తో ఎక్కువగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. ఈమధ్య ఈ తిరగడం ఎక్కువయిందని చెప్పొచ్చు.. దాంతో వీరిద్దరి మధ్య ఎదో జరుగుతుందని పుకార్లు మొదలయ్యాయి. ఎక్కడకు వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్లడం, వీకెండ్ పార్టీలు, డేట్‌లకు తిరుగుతూ రచ్చ చేసేశారు. దాంతో ఇద్దరి మద్య వ్యవహారం ఏదో నడుస్తుందని అంతా భావిస్తున్నారు. అందుకే నెటిజన్స్ వీరిపై ఒక కన్నేసి ఉంచుతున్నారు. కాని వీరిద్దరు మాత్రం బయట పడటం లేదు. తాజాగా వీరిద్దరు కలిసి ఒక వెబ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సందర్బంగా పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు.
మేము ఇద్దరం కూడా ఒకే రకమైన మనస్థత్వంను కలిగి ఉన్నాం. ఆ కారణంగా ఇద్దరం ఎప్పుడు బయటకు తిరుగుతూనే ఉంటాం. ప్రతి రోజు బయటకు వెళ్లి టైమ్ పాస్ చేయాలనుకుంటాం. మా ఇద్దరి మద్య గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి. రెగ్యులర్ గా మా మద్య గొడవలు అవ్వడం ఆ సమయంలో అషు నా నెంబర్ ను బ్లాక్ చేసి నా ఇన్ స్టా ను అన్ ఫాలో చేయడం చేస్తుంది. తనే మళ్లీ కొన్ని రోజుల తర్వాత కూల్ అయ్యి కాల్ చేసి బయటకు వెళ్దాం అని అడుతుంది.