ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ఈ కరోనా లాక్ డౌన్ టైం లో ఓటిటి ప్లాట్ ఫామ్ లకి మంచి ఆదరణ పెరిగింది. వెబ్ సిరీస్ లు మంచి మూవీస్ లతో లాక్ డౌన్ లో ప్రజలను ఎంతగానో టైం పాస్ చేశాయి ఓటిటి వేదికలు. ఈ ఓటిటి వేదికలలో మంచి ప్రజాదారణ పొందిన ప్లాట్ ఫామ్ ఏంటంటే అది నెట్ ఫ్లిక్స్ అనే చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని ఆకట్టుకుంది ఈ వేదిక. ఇప్పుడు తెలుగులో కూడా సత్తా చూపబోతుంది. ‘పిట్ల కథలు’ పేరుతో నెట్‌ఫ్లిక్స్‌ ఇటీవల ఓ తెలుగు ఒరిజినల్‌ను ప్రకటించింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ ఒరిజినల్‌ గురించి డీటెయిల్డ్‌గా ఇప్పటికే మనం చదువుకున్నాం. హిందీలో వచ్చిన ‘లస్ట్‌ స్టోరీస్‌’కి తెలుగు వెర్షన్‌గా ఇది రాబోతోంది. ఇందులో కీలకమైన పాత్రలో మంచు లక్ష్మీప్రసన్న నటిస్తోంది. సహజత్వానికి దగ్గరగా ఉండే ఆ పాత్ర గురించి, దాని కోసం పడ్డ కష్టం గురించి మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది.

ఆ విషయాలు మీ కోసం. అన్నట్లు ఇందులో మంచు లక్ష్మి పేరు ‘స్వరూపక్క’. అంటే మన లక్ష్మక్క… స్వరూపక్కగా కనిపించబోతోందన్నమాట.మంచు లక్ష్మిలో ఎంతటి గొప్ప నటి ఉన్నారో ఇప్పటికే మనం కొన్నిసినిమాల్లో చూశాం. ఉత్తమ ప్రతినాయకురాలిగా నంది పురస్కారం దక్కించుకున్న నటి ఆమె. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలో ప్రశంసలు, పురస్కారాలు వచ్చాయి. ఇప్పుడు ‘పిట్ట కథలు’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వైవిధ్యమైన పాత్రతో వస్తోంది.స్వరూపక్క పాత్రను నిజ జీవితంలో చాలా పాత్రల స్ఫూర్తిగా తీర్చిదిద్దారట.

ఈ పాత్ర పోషించేటప్పుడు మంచు లక్ష్మికి చాలా కష్టంగా అనిపించిందట. ‘‘స్వరూపక్క పాత్రకు… నిజజీవితంలో నా శైలికి ఎక్కడా పొంతన ఉండదు. కానీ పాత్రను జాగ్రత్తగా గమనించి… అందుకు తగ్గట్టుగా నటించాను. తెర మీద చూసేవారికి, నా సన్నిహితులకు ఈ విషయం బాగా అర్థమవుతుంది. నటిగా మనల్ని సవాలు చేసే పాత్రలు చేయాలని అందరూ కోరుకుంటారు. నాకు ఈ సినిమాతో అలాంటి అవకాశం దక్కింది’’ అని చెప్పింది మంచు లక్ష్మి.

మరింత సమాచారం తెలుసుకోండి: