టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటి కాజల్ అగర్వాల్. తన అందంతో అభిమానుల మనసులు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత సినిమాల్లోకి మళ్లీ వస్తుందా.. లేదా..అనే వార్తలు అభిమానుల నోట నుంచి రాగా.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.          

గత ఏడాది అక్టోబర్ 30న ముంబై స్టార్ హోటల్ లో బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్లు ను పెళ్లి చేసుకున్న కాజల్..  తన భర్త తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో చేస్తుంది. ఇదిలా ఉంటే కాజల్ అగర్వాల్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్య సినిమాలు నటిస్తోంది. అంతేకాకుండా  కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2 లో  కాజల్ అగర్వాల్ నటిస్తోంది. వరుస సినిమాలతో నే కాకుండా.. వెబ్ సిరీస్ లో కూడా మొదటిసారిగా నటింది. ఇప్పటికే పలువురు స్టార్ లు వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ప్రస్తుతం కాజల్ నటిస్తున్న వెబ్ సిరీస్ 'లైవ్ టెలికాస్ట్'. కాగా ఈ సిరీస్ ను తమిళంలో చేయగా.. వెంకట ప్రభు దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కనుంది. కాగా ఈ సిరీస్ పోస్టర్ ఇదివరకే విడుదల కాగా.. అందులో కాజల్ లుక్ భయంతో, మరోవైపు డెవిల్ కళ్ళతో ఉండగా.. కాజల్ కు ఇరువైపులా వైభవ్, ఆనంది లు ఉన్నారు. కాగా ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 12న డిస్నీ హాట్ స్టార్ లో అన్ని భాషల్లో ప్రసారమవ్వనుంది.

అంతేకాకుండా హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో వస్తున్న మోసగాళ్లు సినిమాలో హీరోయిన్ గా కాజల్ నటిస్తుంది. అంతేకాకుండా కళ్యాణ్ దర్శకత్వం లో వస్తున్న తమిళ చిత్రం గులేబకావలి సినిమాలో నటించనుంది. మొత్తానికి కాజల్ అగర్వాల్ వరుస సినిమాలతో బిజీగా ఉందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: