మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి తిరు ఫోటోగ్రఫి అందిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఈ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ అతి త్వరలో రిలీజ్ కానుంది. ఇక దీని తరువాత లూసిఫర్ మూవీ తెలుగు రీమేక్ లో మెగాస్టార్ నటించనున్న విషయం తెలిసిందే. యువ దర్శకడు మోహన్ రాజా దర్శకత్వంలో ఎంతో గ్రాండ్ లెవెల్లో రూపొందనున్న ఈ సినిమా యొక్క అధికారిక పూజా కార్యక్రమాలు ఇటీవల ఎంతో వైభవంగా జరిగాయి. తొలిసారిగా ఈ మూవీ ద్వారా మెగాస్టార్ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
ఒరిజినల్ మలయాళ మూవీ ని మన తెలుగు నేటివిటీ కి తగ్గట్లుగా దర్శకడు రాజా కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసి దీనిని తెరకెక్కించనున్నట్లు టాక్. ఇక లేటెస్ట్ గా కొన్ని ఫిలిం నగర్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ మూవీ లో మెయిన్ విలన్ గా ఒక ప్రముఖ తమిళ హీరో నటించనున్నాడని అంటున్నారు. ప్రస్తుతం హీరోగా అలానే పలు ఇతర పాత్రలు చూడ చేస్తున్న సదరు నటుడు మెగాస్టార్ మూవీ లో అవకాశం రావడంతో ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాడని, అతి త్వరలో దీనికి సంబంధించి అధికారికంగా న్యూస్ కూడా బయటకు రానుందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు..... !!