రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకుని విడిపోయి వేరుగా ఉన్నప్పటికీ పవన్ అభిమానులు మాత్రం ఆమెను ఇప్పటికి వదిన అని పిలుస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. ఒకవిధంగా ఈ మితిమీరిన అభిమానం రేణు దేశాయ్ రెండవ పెళ్ళి ఆలోచనలను కూడ  అడ్డుకట్ట వేసింది అన్న అభిప్రాయం కొందరిలో ఉంది.  


ఆమధ్య రేణు దేశాయ్ తన రెండవ పెళ్లి గురించి ప్రస్థావించి పవన్ కళ్యాణ్  అభిమానుల ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. తమ హీరోకు మాజీ భార్య కావడం వల్ల రేణును ఆకోణంలో చూడలేమని చాలమంది  అభిమానులు ఓపెన్ గా చెప్పారు. ఆ తరువాత ఆమె రెండవ పెళ్ళి గురించి మాట్లాడలేదు.


ఇలాంటి పరిస్థితులలో రేణు దేశాయ్ మరోసారి తాను ప్రేమలో ఉన్నానని అధికారికంగా మనసు విప్పి చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈసారి రేణు ప్రేమిస్తున్నది ఒక వ్యక్తిని కాదు ఒక పెంపుడు కుక్కను. ఆ పెట్ డాగ్ పేరు ‘ప్లూటో’. రేణు దేశాయ్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అందరికీ తెలియచేస్తూ ఇప్పుడు తాను ఇలా తన పెంపుడు కుక్కను ప్రేమించడం వల్ల ఎవరికీ ఎటువంటి సమస్యలు ఉండవు అంటూ కామెంట్ చేసింది.


ప్రస్తుతం రేణు దేశాయ్ మంచి పాత్రలు వస్తే సినిమాలలో నటించాలి అని భావిస్తున్నా ఆమెకు సరైన అవకాశాలు రావడం లేదు. ‘సర్కారు వారి పాట’ మూవీలో ఈమె ఒక కీలక పాత్రకు ఎంపిక అయింది అన్న వార్తలు వచ్చినా ఆ వార్తల పై క్లారిటీ లేదు. అదేవిధంగా అకిరా నందన్ అడవి శేష్ నటిస్తున్న ‘మేజర్’ లో నటిస్తున్నాడు అంటూ వార్తలు వచ్చినా ఆ వార్తల పై కూడ రేణు దేశాయ్ నుంచి ఎటువంటి స్పందన లేదు. దీనితో పవన్ కు వ్యక్తిగతంగా అప్పుడే అకిరా నందన్ ను ఇండస్ట్రీలోకి తీసుకు వచ్చే ఆలోచన లేదా అన్న సందేహాలు ఏర్పడుతున్నాయి..





మరింత సమాచారం తెలుసుకోండి: