బుల్లి తెరను ఏలినవారు ఇప్పటివరకు సినిమాలలో పెద్దగ రాణించలేదు. అనసూయ రష్మి గౌతమ్ శ్రీముఖి  లాస్య వర్షిణి లాంటి వారకి లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నప్పటికీ వారు సినిమాలలో పెద్దగా రాణించలేదు. ఈ విషయంలో అనసూయకు కొంతవరకు మినహాయింపు ఉన్నపటికీ ఆమె కేవలం ప్రత్యేక పాత్రలకు ఐటమ్ సాంగ్ లకు మాత్రమే పరిమితం అయిపోయింది.


ఇక మెయిల్ యాంకర్స్ లో అయితే రవి హీరోగా నటించిన సినిమాను ఎవరు పట్టించుకోవక పోవడంతో ఆమూవీ ఎప్పుడు విడుదలై ఎప్పుడు వెళ్ళిపోయిందో ఎవరికీ కూడ తెలియదు. ఇలాంటి పరిస్థితులలో ప్రదీప్ మాచిరాజు హీరోగా ఎంతవరకు విజయం సాధిస్తాడు అన్నవిషయమై ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.


ఇప్పటివరకు ప్రదీప్ బుల్లితెర కార్యక్రమాలకు సంబంధించి తిరుగులేని హీరో అయితే ఇదే సెంటిమెంట్ ఎంతవరకు ఈ యాంకర్ కు సిల్వర్ స్క్రీన్ పై కూడ కలిసి వస్తుంది అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇతడు నటించిన ’30 రోజులలో ప్రేమించడం ఎలా’ ఈరోజు విడుదల కాబోతోంది. ఈమూవీకి మరొక సినిమాతో పోటీ లేకపోవడంతో పాటు ఇప్పటికే ఈమూవీలోని పాటలు సూపర్ హిట్ అయిన పరిస్థితులలో ఈమూవీతో తన దశ తిరుగుతుందని ప్రదీప్ భావిస్తున్నాడు.


పునర్జన్మల చుట్టూ అల్లబడ్డ ఈ ప్రేమ కథలో కొంతవరకు ఒకనాటి ‘మూగమనసులు’ ఛాయలు కొంతవరకు కనిపిస్తాయా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇప్పటి యూత్ ట్రెండ్ కు అనుగుణంగా అనేక సీన్స్ ఈమూవీలో ఉంటాయని ప్రచారం జరుగుతోంది. అంచనాలకు అనుగుణంగా ఈ మూవీ సక్సస్ అయితే బుల్లితెర పాపులర్ ఆర్టిస్టులు సినిమాలలో హీరోలుగా హీరోయిన్స్ గా రాణించరు అన్న సెంటిమెంట్ కు బ్రేక్ పడినట్లే అనుకోవాలి. ఈమూవీ ఊహించిన విధంగా సక్సస్ టాక్ తెచ్చుకోగలిగితే ప్రభుత్వం లేటెస్ట్ గా ఫిబ్రవరి 1నుండి అమలు చేయబోతున్న సినిమా హాళ్ళలో సీటింగ్ ఆక్యుపెన్సీ సడలింపు నిబంధనలు కూడ ప్రదీప్ కు కలిసి వచ్చే అవకాశం ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: