బంగారం ధర చుక్కలను తాకడంతో దేశ వ్యాప్తంగా ఆభరణాలకు గిరాకీ తగ్గిందని కేవలం పండుగలు పెళ్ళిళ్ళ సీజన్ లో మాత్రమే బంగారు ఆభరణాలకు డిమాండ్ ఏర్పడిందని ఆ నివేదిక వెల్లడించింది. అదేవిధంగా కరోనా పరిస్థితులు వల్ల పెళ్ళిళ్ళకు వేడుకలకు వచ్చేవారి సంఖ్య బాగా తగ్గిపోవడంతో పెళ్ళిళ్ళలో బహుమతులుగా బంగారు వస్తువులు ఇచ్చే సాంప్రదాయం తగ్గిందని ఆ నివేదిక వెల్లడించింది.
దీనికితోడు కరోనా పరిస్థితులు వల్ల ఎగువ మధ్యతరగతి వర్గాల కుటుంబాలు తమ కుటుంబాలకు వచ్చే ఆదాయం తగ్గడంతో పసిడిని అమ్మకుండా పసిడి ఋణాలు భారీ స్తాయిలో తీసుకోవడంతో బంగారం పునర్వినియోగం బాగా తగ్గిందని ఆ నివేదిక బాగా వెల్లడించింది. దీనితో పసిడి గిరాకీ బాగా తగ్గడంతో ఈ వ్యాపారం మళ్ళీ క్రితంలా లాభాల బాట పట్టడానికి కొంత సమయం పడుతుందని ఆ అంచనా తెలియ చేసింది. ఈ పరిస్థితులు ఇలా ఉండగా నిన్న కూడ షేర్ మార్కెట్ పతనం కొనసాగడంతో ఈ మార్కెట్ పరిస్థితి వచ్చే సోమవారం ఎలా ఉంటుంది అన్న అంచనాలు తలలు పండిన విశ్లేషకులు కూడ అంచనాలు కట్టలేకపోతున్నారు.
ఇలాంటి వ్యతిరేక పరిస్థితులలో వచ్చే పదేళ్లల్లో రాబోతున్న మార్పులు గురించి మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్యానాదేళ్ళ చేసిన కామెంట్స్ చాల ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రస్తుతం కంపెనీలు పుంజుకోవాలి అన్నా వ్యాపార కార్యకలాపాలు అభివృద్ధి చెందాలి అన్నా రానున్న్ 10 సంవత్సరాలలో డిజిటల్ సాంకేతికత వల్లే జరుగుతుంది అందువల్ వయసుతో సంబంధం లేకుండా అందరు డిజిటల్ సాంకేతికతలో అభివృద్ధి సాదించాలి అంటు రాబోయ్ 10 ఏళ్ళల్లో వచ్చే మార్పులు ఊహిస్తున్నారు..