ఆర్‌ఆర్‌ఆర్ మొదలై రెండేళ్లు దాటింది. అక్టోబర్13న వస్తున్నామని ప్రకటించారు. అల్లు అర్జున్ పుష్ప మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకొని..అందరితోపాటు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తూ.. ఆగస్టు 13న ముహూర్తం పెట్టుకుంది. సర్కారువారి పాట షూటింగ్ మొదలై మూడు రోజులు అయిందో లేదో.. 2022 సంక్రాంతికి వచ్చేస్తున్నామంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. సర్కారువారిపాట షూటింగ్ ఈనెల 25న దుబాయ్‌లో మొదలైంది. సరిలేరునీకెవ్వరు తర్వాత సినిమా ఆరు నెలలు గ్యాప్ తీసుకొని సర్కారు వారి పాటను ఎనౌన్స్ చేశాడు మహేశ్. సినిమా పట్టాలు ఎక్కడానికి 8 నెలలు పట్టింది. ఈ ఏడాదంతా సెట్స్‌పైనే ఉంటూ.. షూటింగ్ కోసం సంవత్సరం తీసుకుంటున్నాడు పరశురామ్.
సరిలేరునీకెవ్వరుతో మరోసారి కలిసొచ్చిన సంక్రాంతికే రావాలని ఫిక్స్ అయ్యాడు మహేశ్. ఒక్కడు.. బిజినెస్‌మేన్.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు.. సరిలేరునీకెవ్వరు సంక్రాంతికి వచ్చి మహేశ్‌కు హిట్ తీసుకొచ్చాయి. ఇదే దారిలో సంక్రాంతి హిట్ ఖాతాలో సర్కారువారిపాటను చూడాలనుకుంటున్నాడు మహేశ్.
సర్కారువారి పాట రిలీజ్ పోస్టర్‌లో హీరో చేతిలోని తాళాల గుత్తి ఆసక్తి రేపింది. ఫైట్ సీన్‌లో ఆయుధంలా ఇది పట్టుకున్నాడా? బ్యాంక్ చుట్టూ తిరిగే ఈ కథకు తాళాలకు సబంధం ఏమిటన్న ప్రశ్న నెటిజన్లను ఆలోచింపచేసింది. తమన్ మ్యూజిక్ ఇస్తున్న ఈ సినిమాలో మహేశ్‌తో ఫస్ట్ టైం కీర్తిసురేష్ జత కడుతోంది. మొత్తానికి సూపర్ స్టార్ మహేశ్ బాబు వచ్చేస్తున్నాడు. ఫ్యాన్స్ లో మరింత క్రేజ్ పెంచేస్తున్నాడు. ఆ సినిమాలో తమ అభిమాన హీరో ఎలా నటించాడోనన్న ఉత్కంఠ వారిలో నెలకొంది. చూద్దాం.. మరి మహేశ్ బాబు వారిని ఎలా సర్ ప్రైజ్ చేస్తాడో.